Omicron scare: IndiGo Airlines to cancel 20% flights as Covid cases surge waives change fees : దేశంలో రోజురోజుకు కోవిడ్‌ కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. దీంతో పలు విమాన సంస్థలు తమ సర్వీసుల్ని రద్దు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ విమానాయన సంస్థ ఇండిగో (IndiGo Airlines) 20 శాతం ఫ్లైట్స్‌ను (20% flights) రద్దు చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక పెరుగుతోన్న కోవిడ్ కేసుల వల్ల చాలా మంది ప్రయాణికులు ట్రావెలింగ్‌ను పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తోంది. అయితే ఇండిగో ప్యాసింజర్స్ తమ ఫ్లైట్‌ బుకింగ్స్‌ను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా రీషెడ్యూల్ చేసుకునేందుకు ఇండిగో అనుమతించింది. మార్చి 31 వరకు విమానాల బుకింగ్స్‌లో (Flight bookings‌) మార్పులు చేసుకున్నట్లయితే ఎలాంటి అదనపు ఛార్జీ వసూలు చేయమని ఇండిగో స్పష్టం చేసింది. జనవరి 31 వరకు చేసిన అన్ని బుక్సింగ్‌కు ఈ ఆఫర్‌‌ వర్తిస్తుంది. 


అంతేకాదు ఇప్పటికే ఇండిగో ప్లాన్‌-బి కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇండిగో నుంచి విమానం రద్దు అయినా లేదా రీషెడ్యూల్ చేసినా ప్యాసింజర్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కంది.


ప్రయాణికుల సౌకర్యార్థం వారి ఫ్లైట్ సమయాన్ని లేదా తేదీని మార‍్చుకోవచ్చు. ఎలాంటి అదనపు ఛార్జీలు (Additional charges) లేకుండా లేకుండా రీఫండ్‌ పొందవచ్చు. రెండు గంటల కంటే ఎక్కువసేపు రద్దు అయినా, లేదా రీషెడ్యూల్ అయినా అలాంటి ఫ్లైట్స్‌ కోసం ప్రయాణికులు వేచి చూడాల్సిన అవసరం లేదని ఇండిగో తెలిపింది.


Also Read :AP Corona update: ఏపీలో పెరిగిన కరోనా కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే?


అలాగే ప్రస్తుతం కోవిడ్‌ (Covid) వల్ల తమ విమాన సర్వీసుల్లో (Flight services) అంతరాయం ఏర్పడొచ్చవని పేర్కొంది. అలా మార్పులు చేర్పులు చేసినా లేదా సర్వీస్‌ పూర్తిగా రద్దు అయినా ప్రయాణికులకు వెంటనే సమాచారం ఇస్తామని ఇండిగో (IndiGo) పేర్కొంది.


Also Read : Rajendra Prasad: కరోనాతో ఆసుపత్రిలో చేరిన నటుడు రాజేంద్ర ప్రసాద్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook