OnePlus new TV: ప్రముఖ స్మార్ట్​టీవీల బ్రాండ్ వన్​ ప్లస్​ మార్కెట్లోకి మరో కొత్త టీవీని ఆవిష్కరించింది. వై1ఎస్​ ప్రో పేరుతో కొత్త టీవీని విడుదల చేసింది. దీనితో వై సిరీస్​కు కొనసాగింపుగా ఈ టీవీని మార్కెట్లోకి తీసుకొచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

4కే యూహెచ్​డీ ప్యానెల్​తో ఈ ఫోన్ అందాబుటులోకి వచ్చింది. ఇందులో కనెక్ట్​ 2.0 ఫీచర్​తో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్​ ఇంటిని స్మార్ట్ హబ్​గా మార్చేందుకు ఉపయోగపడనుందట.


ఈ కొత్త టీవీ ధర ఎంత?


వన్​ప్లస్ టీవీ 43 వై1ఎస్​ ప్రో​ టీవీని బడ్జెట్ రేంజ్​లోనే తీసుకొచ్చించి కంపెనీ. ఈ మోడల్​ ధరను రూ.29,999గా నిర్ణయించింది. ఏప్రిల్ 11 నుంచి ఈ టీవీల విక్రయాలు ప్రారంభం కానున్నాయని పేర్కొంది. అమెజాన్​, వన్​ప్లస్​ అధికారిక వెబ్​సైట్లో కొనుగోలు చేసే వీలుంది. ఇక ఆఫ్​లైన్​లో అయితే వన్​ప్లస్​ ఎక్స్​పీరియన్స్ స్టోర్స్​, క్రోమా, రిలయన్స్ డిజిటల్ సహా ఇతర భాగస్వామ్య స్టోర్​లలో కొనొచ్చని వివరించింది.


ఎస్​బీఐ క్రెడిట్​ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే తక్షణం రూ.2,500 వరకు డిస్కౌంట్ పొందొచ్చని తెలిపింది వన్​ప్లస్​.



వన్​ప్లస్​ టీవీ 43 వై1ఎస్​ ప్రో ఫీచర్లు..


వన్​ప్లస్​ టీవీ 43 వై1ఎస్​ ప్రో హెడ్​డీఆర్​10+, హెచ్​డీఆర్​10, హెచ్​ఎల్​జీ పార్మాట్లను సపోర్ట్ చేస్తుంది.


రెండు ఫుల్​ రేంజ్ స్పీకర్స్​ ఉంటాయి. దీని ద్వారా 24 వాట్స్​, డాల్బి ఆడియా సిస్టమ్​ ఉంది.


4కే రెసొల్యూషన్ సపోర్ట్ ఉంది.


Also read: RBI MPC meet: కీలక వడ్డీ రేట్లు యథాతథం- ఇకపై అన్ని ఏటీఎంలలో కార్డ్​లెస్​ విత్​డ్రా!


Also read: Petrol Diesel Price Today: వాహనదారులకు గుడ్ న్యూస్- పెట్రోల్, డీజిల్ ధరలపై ఊరట!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook