ONGC Crude Oil: క్రూడ్ ఆయిల్ కోసం భారతదేశం చాలాకాలంగా ఇతర దేశాలపై ఆధారపడుతోంది. ఇప్పుడిక ఆ ఆవసరం దాదాపుగా ఉండదు. దేశంలోనే తొలిసారిగా క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు బయటపడ్డాయి. తొలిదశ చమురు ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. దేశంలో తొలిసారిగా బయటపడ్డ క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు ఎక్కడున్నాయంటే


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కృష్ణా గోదావరి బేసిన్‌లో ఓఎన్జీసీ చాలాకాలంగా గ్యాస్ నిక్షేపాల్ని వెలికితీస్తోంది. తొలిసారిగా క్రూడ్ ఆయిల్ నిక్షేపాల్ని కనుగొంది. ఏపీలోని కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో 98/2 కృష్ణా గోదావరి బేసిన్  సమీపంలో సముద్రంలో ఈ నిక్షేపాల్ని గుర్తించారు. 26 బావుల ద్వారా రోజుకు 45 వేల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేయనుంది. ఈ ఏడాది మే-జూన్ నాటికి రోజుకు 45 వేల బ్యారెళ్లు ఉత్పత్తికి చేరుకోవచ్చు. ఈ బ్లాక్ నుంచి తొలిసారిగా చమురు ఉత్పత్తి ప్రారంభమైనట్టు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఇక్కడ్నించి రోజుకు 45 వేల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్, 10 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి ఉంటుందని అంచనా. ప్రస్తుత చమురు ఉత్పత్తికి 7 శాతం అదనంగా చేరనుంది. 


వాస్తవానికి ఓఎన్జీసీ క్లస్టర్ 2 నుంచి చమురు ఉత్పత్తి నవంబర్ 2021 నాటికే ప్రారంభం కావల్సి ఉన్నా కోవిడ్ మహమ్మారి కారణంగా ఆలస్యమైంది. మే 2023 నాటికి గడువు పొడిగించారు. ఆ తరువాత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ , డిసెంబర్ నెలలకు వాయిదా పడుతూ వచ్చింది. చివరికి జనవరిలో ఇప్పుడు చమురు ఉత్పత్తి ప్రారంభమైంది.



ఓఎన్జీసీ సబ్ సీ ఆయిల్ ఉత్పత్తికి ఆర్కడ స్టెర్లింగ్ వి అనే నౌకను అద్దెకు తీసుకుంది. ఈ నౌక 70 శాతం షాపూర్జీ పల్లోంజీ ఆయిల్ అండ్ గ్యాస్ కార్పొరేషన్, 30 శాతం మలేషియాకు చెందిన ఆర్కడకు చెందింది. ఓఎన్జీసీ చమురు ఉత్పత్తి ప్రారంభం కావడంతో ఆ సంస్థ షేర్లు పెరుగుతున్నాయి. స్టాక్ అప్పుడే 52 వారాల గరిష్టాన్ని తాకింది. 


Also read: Aadhaar Update: ఆధార్‌లో అడ్రస్, పుట్టినతేదీ మార్చేందుకు ఏమేం అవసరం, ఎలా చేయాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook