OPPO 50 Inch Smart TV: ఒప్పో 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ వచ్చేసింది.. ధర కేవలం 15 వేల రూపాయలే! అద్భుత ఫీచర్లు
OPPO launches K9x Smart TV 50 inch. తక్కువ ధరలో 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి శుభవార్త. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ `ఒప్పో` 50 ఇంచెస్ స్మార్ట్ టీవీని మార్కెట్లోకి రిలీజ్ చేసింది.
OPPO launches K9x Smart TV 50 inch: ప్రస్తుత రోజులల్లో ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో భారీ పరిమాణం కలిగిన స్మార్ట్ టీవీలు ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారు. కరోనా మహమ్మరి కారణంగా ఎంటర్‌టైన్‌మెంట్ మొత్తం ఓటీటీల చుట్టూనే తిరగడమే ఇందుకు `ప్రధాన కారణం. సినిమాలు, వెబ్ సిరీసెస్, క్రీడలు లాంటి ఎంటర్‌టైన్‌మెంట్ మొత్తం ఓటీటీలలో అందుబాటులో ఉండడంతో.. అందరూ స్మార్ట్ టీవీలు భారీగా కొనుగోలు చేస్తున్నారు. 32, 40, 43, 50, 55, 60, 65 ఇంచెస్ కొనుగోలు చేస్తున్నారు. అయితే తక్కువ ధరలో 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి శుభవార్త. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ 'ఒప్పో' 50 ఇంచెస్ స్మార్ట్ టీవీని మార్కెట్లోకి రిలీజ్ చేసింది.
ఇదివరకు 65 ఇంచెస్ స్మార్ట్ టీవీని విడుదల చేసిన ఒప్పో.. తాజాగా 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ మార్కెట్లోకి వదిలింది. దాంతో OPPO K9x స్మార్ట్ టీవీ సిరీస్‌ను విస్తరించింది. OPPO K9x 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్రస్తుతం చైనాలో ప్రారంభించబడింది. ఈ టీవీ ధర 1399 యువాన్ (భారత కరెన్సీ ప్రకారం రూ. 16,403) లు. అయితే లాంచ్ ఆఫర్ కింద ఈ టీవీ 1299 యువాన్లకు (భారత కరెన్సీలో సుమారు రూ. 15,210) అందుబాటులో ఉంది. Oppo TV అధికారిక Oppo స్టోర్ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. అతి త్వరలోనే ఈ స్మార్ట్ టీవీ మంద దేశంలో కూడా అంబాటులో ఉండనుంది.
50 ఇంచెస్ స్మార్ట్ టీవీలో 4K రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్, క్వాడ్-కోర్ మీడియాటెక్ చిప్‌సెట్ మరియు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. OPPO K9x 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ LED బ్యాక్‌లిట్ ప్యానెల్‌తో స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో పూర్తిగా 4K రిజల్యూషన్‌ను అందిస్తున్నారు. మీ కళ్లపై ఒత్తిడిని తగ్గించడానికి 10.7 బిలియన్ కలర్స్ మరియు బ్లూ-లైట్ తగ్గింపు సాంకేతికత ఉంది. ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ టీవీల వలె.. బాల్‌పార్క్‌లో డిస్‌ప్లే-స్థాయి రంగు ఖచ్చితత్వాన్ని కలిగి ఉంది. ఇది ఇమేజ్ నాణ్యతను ఫ్రేమ్-బై-ఫ్రేమ్ మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.
OPPO K9x 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ AI PQ అల్గారిథమ్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ టీవీ యొక్క గరిష్ట బ్రైట్ నెస్ 280 నిట్‌లు మాత్రమే. ఈ టీవీలో 2GB RAM మరియు 16GB ROM ఉంటుంది. క్వాడ్-కోర్ MediaTek చిప్‌సెట్, 20W పవర్ రేటింగ్‌తో రెండు ఇంటిగ్రేటెడ్ స్పీకర్‌లు, మూడు HDMI పోర్ట్‌లు, ఒక ఈథర్నెట్ పోర్ట్ ఉన్నాయి. వైర్‌లెస్ కనెక్షన్ కోసం డ్యూయల్-బ్యాండ్ Wi-Fiకి మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్ టీవీని Xiaobu వాయిస్ అసిస్టెంట్ ఉపయోగించి నియంత్రించవచ్చు.
Also Read: ఈ జీతంతో మీకు పన్నులు కట్టాలా.. నా పిల్లలకు తిండి పెట్టాలా! ప్రధానిపై మహిళ ఆవేదన
Also Read: Vodafone Idea: వోడాఫోన్ ఐడియా యూజర్లకు బంపర్ ఆఫర్.. 28 రోజుల పాటు SonyLIV ఉచితం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook