Oppo A57 Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి అత్యద్భుతమైన వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌పోన్ వస్తోంది. అద్భుతమైన ఫీచర్లు, తక్కువ ధరతో అందుబాటులో రానున్న ఒప్పో ఏ57 గురించి తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏడాది ప్రారంభంలో ఒప్పో చైనాలో OPPO A57 5G లాంచ్ చేసింది. ఇండియా, థాయ్‌లాండ్ ప్రాంతాల్లో మాత్రం ఇదే మోడల్ 4జి వెర్షన్ ప్రవేశపెట్టింది. ఇదే డివైస్ మరో మోడర్ యూరప్ మార్కెట్‌లో ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది. ఒప్పో త్వరలోనే OPPO A57sను యూరోపియన్ మార్కెట్‌లో లాంచ్ చేయనుంది. ఇది సింగిల్ స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తోంది. 


OPPO A57 ధర


ఏ 57 అనేది 64 జీబీ స్టోరేజ్‌తో ఉండగా, ఏ 57 ఎస్ మాత్రం 128 జీబీతో ఉంటుంది. ఒప్పో ఏ57 ధర కేవలం 13, 765 రూపాయలు మాత్రమే. అటు ఒప్పో ఏ57ఎస్ 128 జీబీ ధర 16 వేల 209 రూపాయలుగా ఉంది. ఇది యూరోపియన్ మార్కెట్ ధర. 


OPPO A57 ఫీచర్లు


ఒప్పో ఏ57 6.56 ఇంచెస్ ఎల్‌సిడి ప్యానల్ ఉంటుంది. ఇందులో హెచ్‌డి ప్లస్ రిసొల్యూషన్ ఉంది. ఇది కేవలం 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇందులో మీడియాటెక్ హెలియో జి35 చిప్ సెట్ 64 జీబీ స్టోరేజ్ 4 జీబి ర్యామ్ ఉంటుంది. బ్యాటరీ సామర్ద్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 33 వాట్స్ సూపర్‌ఫాస్ట్ చార్జర్‌తో వస్తుంది. ఇక ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మోనో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ మాత్రం 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్‌బి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కలిగి ఉంది. 


Also read: iPhone 13 Deal: 1 లక్షా 19 వేల ఐఫోన్ 13 ప్రో కేవలం 16 వేల 5 వందలకే..ఎక్కడ, ఎలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook