PAN-Aadhaar: పాన్​తో ఆధార్​​ అనుంధానానికి తుది గడువు సమీపిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వం మార్చి 31ని చివరి తేదీగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ గడువులోపు ఆధార్​తో పాన్ అనుసంధానం చేయకుంటే ఆర్థిక పరమైన లావాదేవీల విషయాల్లో అనే ఇబ్బందులు ఎదురవ్వచ్చు.
నిజానికి ఆధార్​ పాన్ అనుసంధానానికి అనేక సార్లు గడువు పొడగించింది ప్రభుత్వం. కరోనా కారణంగా అనేక సార్లు గడువు పెంచగా.. మరోసారి ఇందుకు అవకాశం ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందుకే గడువులోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) స్పష్టం చేసింది. మార్చి 31లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయకుంటే పాన్​ నిరుపయోగంగా మారుతుందని కూడా వెల్లడించింది.


ఇన్​కం ట్యాక్స్​ వెబ్​సైట్లోకి వెళ్లు సులంభంగా ఇంట్లోనే పాన్-ఆధార్​ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసుకునే వీలుంది. అంతే కాదు ఆదార్​తో-పాన్ అనుసంధానమైందా లేదా అనే విషయాన్ని కూడా తనిఖీ చేసుకోవచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం.


  • ముందుగా ఇన్​కం ట్యాక్స్​ వెబ్సైట్లోకి (www.incometax.gov.in) లాగిన్ అవ్వాలి

  • ఇక్కడ క్విక్​ లింక్స్ ఆప్షన్​పై క్లిక్ చేయాలి. ఇందులో 'లింక్ ఆధార్​ స్టేటస్​' అనే స్టేటస్​ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.

  • ఇక్కడ కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ పాన్​-ఆధార్​ నంబర్లను ఎంటర్​ చేయాల్సి ఉంటుంది.

  • ఆధార్​-పాన్ వివరాలు సమర్పించిన తర్వాత..  వ్యూ లింక్ ఆధార్​ స్టేటస్​ ఆప్షన్​పై క్లిక్ చేయాలి.

  • ఇక్కడ ఆధార్​-పాన్​ స్టేటస్​ డిస్​ప్లే అవుతుంది. ఒకవేళ ఆధార్​ పాన్ లింక్ అయ్యుంటే.. పాన్-ఆధార్​ అనుసంధానమై ఉందని ఇంగ్లీష్​లో ఉంటుంది.

  • ఒకవేళ అనుసంధానం పూర్తవకుంటే.. వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయడం ఉత్తమం.


Also read: TATA Digital Payments: డిజిటల్ పేమెంట్స్ వ్యాపారంలో టాటా సంస్థ, త్వరలో ప్రారంభం


Also read: Gold and Silver Rates Today: స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. హైదరాబాద్‌లో నేటి బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook