Pan Card Correction Process: ఈ మధ్యకాలంలో ఏ పని చేయాలన్నా కూడా ఆధార్ కార్డ్, పాన్ కార్డు అనేది తప్పనిసరి అయిపోయాయి.ఈ రెండు లేకుండా ఎలాంటి  పనులు చేయలేకపోతున్నాం.బ్యాంకులో అకౌంట్ తెరవాలన్నా, రుణం పొందాలన్నా, ఒక ప్రభుత్వ పథకం పొందాలనుకున్నా, బస్సు, విమానం, రైలులో ప్రయాణించాలన్నా కూడా ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు వంటివి అధికారిక గుర్తింపు కార్డులుగా మారిపోయాయి.అయితే ఒక్కోసారి ఈ ముఖ్యమైన డాక్యుమెంట్లలో మీ పేరు కానీ స్పెల్లింగ్ కానీ తప్పుగా ముద్రించినప్పుడు వాటిని ఎలా మార్చుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా సందర్భాల్లో పాన్ కార్డు అదే విధంగా ఆధార్ కార్డులో మీ పేరు కొన్నిసార్లు వేరువేరుగా ముద్రిస్తారు.అలాంటప్పుడు మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో కూర్చునే ఆన్ లైన్ ద్వారా పాన్ కార్డులో మీ పేరును సరిదిద్దుకోవచ్చు. అది ఎలాగో మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.అప్పుడు మీరు ఎంచక్కా ఇంటి వాద్దే ఉండి ఈ పని చేయవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆన్‌లైన్‌లో ప్యాన్ కార్డ్ ఎలా సరిదిద్దుకోవాలి:


- ముందుగా మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ (www.incometaxindia.gov.in)కి వెళ్లాలి.


-ఇప్పుడు ఇక్కడ మీరు పాన్ నంబర్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.


- ఆ తర్వాత పాన్ కార్డ్ కరెక్షన్ ఆప్షన్ ఎంచుకోవాలి.


- ఇప్పుడు స్క్రీన్‌పై అడిగిన మొత్తం సమాచారం,అలాగే  సంబంధిత డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.


- ఆ తర్వాత, ఫారంను సమర్పించడానికి మీరు కరెక్షన్ ఫీజు రూ. 106 చెల్లించాలి.


-ఇప్పుడు ఫీజు చెల్లించిన తర్వాత మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఆ తర్వాత మీకు రసీదు లభిస్తుంది.


- రసీదుపై ఇచ్చిన నంబర్ సహాయంతో, మీ అప్‌డేట్ చేయబడిన పాన్ కార్డ్ ఎప్పుడు డెలివరీ చేయబడుతుందో మీరు ట్రాక్ చేయవచ్చు.


-మీరు NSDL e-Gov పోర్టల్ ద్వారా కూడా పాన్ కార్డ్‌లో కరెక్షన్ ను పొందవచ్చు.


Also Read : Budget 2024:పెన్షన్‎దారులకు బడ్జెట్‌లో గుడ్‎న్యూస్?అటల్ పెన్షన్ యోజన రూ.10 వేలకు పెంచే చాన్స్.!!  


ఆఫ్‌లైన్‌లో కరెక్షన్ ఎలా చేయాలి?


ఆన్‌లైన్‌లోనే కాకుండా, మీరు మీ పాన్ కార్డ్‌ని ఆఫ్‌లైన్‌లో కూడా కరెక్షన్ చేయించుకోవచ్చు. ఇందు  కోసం మీరు సమీపంలోని మీ సేవ లేదా పాన్ కార్డు సర్వీసు కేంద్రానికి వెళ్లాలి. ఇక్కడ మీరు పాన్ కార్డ్‌లో కరెక్షన్ కోసం ఫారమ్‌ను పూరించాలి. అలాగే అవసరమైన పత్రాలను కూడా జతచేయాలి. ఆ తర్వాత, ఫారమ్‌ను సమర్పించండి. ఆ తర్వాత పాన్ కార్డ్ కొన్ని రోజుల్లో మీ ఇంటికి వస్తుంది.


Also Read :Income Tax Deductions: ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ఈ 4 డిడక్షన్స్ గురించి తెలుసుకోండి..లేకపోతే భారీ నష్టం తప్పదు.!!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి