Pan Card Download: కేవలం 10 నిమషాల్లో పాన్‌కార్డు పొందడం ఎలాగో తెలుసా
Pan Card Download: ఆధార్ కార్డు ఎంత అవసరమో పాన్‌కార్డు కూడా అంతే అవసరం. త్వరలో పాన్‌కార్డు నిత్య జీవితంలో కీలకమైన డాక్యుమెంట్‌గా మారనుంది. పాన్‌కార్డు గురించి కీలకమైన అప్డేట్స్ మీ కోసం.
Pan Card Download: పాన్‌కార్డు పోగొట్టుకుంటే ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇ పాన్‌కార్డును కేవలం పదే పది నిమిషాల్లో ఇంట్లో కూర్చుని పొందవచ్చు. పాన్‌కార్డు సులభంగా ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా చేస్తే కేవలం 10 నిమిషాల్లోనే ఇ పాన్‌కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇటీవలి కాలంలో పాన్‌కార్డు వినియోగం పెరుగుతోంది. అతి ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారుతోంది. బ్యాంకింగ్ లేదా ఇతర ఆర్ధిక లావాదేవీలకు తప్పనిసరిగా మారింది. బ్యాంక్ ఎక్కౌంట్, ఆస్థి కొనుగోలు లేదా విక్రయం, వాహనం కొనుగోలు లేదా విక్రయం, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం ఇలా దేనికైనా సరే పాన్‌కార్డు ఉండాల్సిందే. అంత ముఖ్యమైన పాన్‌కార్డు పోతే మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా సులభంగా ఇ పాన్‌కార్డు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇన్‌కంటాక్స్ శాఖ. ఆధార్ కార్డు సహాయంతో ఇ పాన్‌కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం మీ ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ పాన్‌కార్డు లింక్ అయిండాలి. పైసా కూడా ఖర్చు కాకుండా కేవలం పది నిమిషాల్లో ఇంట్లో కూర్చుని ఇ పాన్‌కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
e Pan Card అంటే ఏమిటి
ఇ పాన్‌కార్డు అనేది పాన్‌కార్డును ఇన్‌స్టంట్‌గా అందించే క్రమంలో ప్రవేశపెట్టారు. పక్కా ఆధార్ నెంబర్ ఉంటే ఇ పాన్‌కార్డు జారీ అవుతుంది. ఇ పాన్‌కార్డు అనేది డిజిటల్ సైన్ చేసి ఉంటుంది. ఆధార్ ఇ కేవైసీ ధృవీకరణ తురవాత జారీ చేస్తారు. పీడీఎఫ్ ఫార్మట్‌లో వస్తుంది.
ఇ పాన్‌కార్డు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి
ముందుగా ఇన్‌కంటాక్స్ శాఖ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. అందులో ఇన్‌స్టంట్ ఇ పాన్ ఎంచుకోవాలి. ఇప్పుుడు చెక్ స్టేటస్ లేదా డౌన్‌లోడ్ పాన్ క్లిక్ చేయాలి. తరువాత మీ 12 అంకెల ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. చెక్ బాక్స్ మార్క్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆధార్ కార్డుతో రిజిస్టర్ అయిన మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇప్పుడు వ్యూ ఇ పాన్ ఆప్షన్ ఉంటుంది. ఓసారి సరిచూసుకుని డౌన్‌లోడ్ ఇ పాన్‌కార్డు క్లిక్ చేస్తే చాలు..మీక్కావల్సిన ఇ పాన్ కార్డు క్షణాల్లో పీడీఎఫ్ ఫార్మట్‌లో డౌన్‌లోడ్ అవుతుంది.
Also read: Aadhaar Card Update: ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, నెంబర్, పుట్టిన తేదీ ఎన్ని సార్లు మార్చుకోవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook