PAN Card: మీ పాన్ కార్డు పోయిందా? 10 నిమిషాల్లో డౌన్ లోడ్ చేసుకోండి ఇలా?
PAN Card: మీ పాన్ కార్డు పోయిందని టెన్షన్ పడుతున్నారా? అయితే మీరు కంగారు పడకండి. పోయిన పాతకార్డు స్థానంలో కొత్త కార్డును పొందడానికి ఇలా చేయండి.
How to download E-PAN: పాన్ కార్డు అనేది భారతీయ పన్ను చెల్లింపుదారులకు జారీ చేయబడిన గుర్తింపు పత్రం. ఇది భారతదేశ ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) జారీ చేసిన జాతీయ గుర్తింపు కార్డు. పాన్ నంబర్ అనేది 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్. ఐటీ లావాదేవీలకు, పన్ను చెల్లింపులకు ఇది ముఖ్యమైన ప్రూవ్. ఇది పోయిందంటే మీరు చిక్కుల్లో పడినట్లే. మీ పాన్ కార్డు ఎక్కడైనా పడిపోయినా, పోగొట్టుకున్న మీరు ఆన్‌లైన్‌లో సులభంగా ఇ-పాన్ కార్డ్‌ని పొందవచ్చు. కేవలం 10 నిమిషాల్లోనే ఇ-పాన్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
e-PAN కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..
** ముందుగా ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌కి లాగిన్ అవ్వండి (https://www.incometax.gov.in/iec/foportal/):
** మీరు హోమ్ పేజీ ఓపెన్ చేసి... మీకు అక్కడ కనిపించే Instant e-PAN ఆప్షన్ పై క్లిక్ చేయండి.
** దీని తర్వాత కొత్త ఇ-పాన్ పేజీలో గెట్ న్యూ ఇ-పాన్‌పై క్లిక్ చేయండి.
** కొత్త ఇ-పాన్ పేజీలో ఆధార్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత కన్ఫర్మ్ చెక్‌బాక్స్‌ని ఎంచుకుని.. కొనసాగించుపై క్లిక్ చేయండి.
** OTP ధ్రువీకరణ పేజీలో నేను నిబంధనలను చదివాను మరియు కొనసాగడానికి అంగీకరిస్తున్నాను క్లిక్ చేయండి.
** ఇప్పుడు ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు 6 అంకెల OTP వస్తుంది, దానిని మీకు ఇవ్వబడిన బాక్స్ లో ఎంటర్ చేయండి.
** UIDAIతో ఆధార్ వివరాలను ధృవీకరించడానికి చెక్‌బాక్స్‌ని ఎంచుకుని కొనసాగించుపై క్లిక్ చేయండి.
** ధ్రువీకరణ ఆధార్ వివరాల పేజీలో నేను అంగీకరిస్తున్నాను చెక్‌బాక్స్ ఆప్షన్ ను ఎంచుకుని, కొనసాగించు క్లిక్ చేయండి.
** దీని తర్వాత మీ మొబైల్ నంబర్‌కు సక్సెస్ అయినట్లు మెసేజ్ వస్తుంది. దాని ఐడీని గుర్తించుకోండి.
** అనంతరం మీరు మీ యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్‌తో ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ అవ్వండి. ఆ తర్వాత డ్యాష్‌బోర్డ్‌లో సర్వీస్ ఇ-పాన్ యొక్క వ్యూ/డౌన్‌లోడ్ ఎంపికపై క్లిక్ చేయండి. దీని తర్వాత మీ 12 అంకెల ఆధార్ నంబర్ ఎంటర్ చేసి క్లిక్ చేయండి. అనంతరం మీ మెుబైల్ కు ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేసిన తర్వాత మీరు మీ పాన్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Also Read: Rs 2000 Notes Last Date: 2 వేల నోటుకు సమయం లేదు మిత్రమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి