Pan Card Fraud: మన దేశంలో పాన్ కార్డు వినియోగం చాలా పెరిగింది. మనం చేసే ఆర్థిక లావాదేవిలన్నిటికీ ప్రస్తుతం పాన్ కార్డు కీలకంగా మారింది. ఇది ముఖ్యమైనదిగా కాబట్టి.. గోప్యంగా ఉంచడం చాలా ముఖ్యం. అయితే ప్రజలు చాలాసార్లు పాన్ కార్డును సరిగా పట్టించుకోకపోవడంతో దుర్వినియోగం అవుతుంది. మీ పాన్ కార్డుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదాయపు పన్ను శాఖ తన పాన్ కార్డ్ హోల్డర్లందరికీ ఎప్పటికప్పుడు తమ పాన్ కార్డ్ హిస్టరీని చెక్ చేసుకోవాలని సలహా ఇస్తూనే ఉంటుంది. దీంతో తమ పాన్ కార్డు ఏయే ప్రదేశాల్లో ఉపయోగించారో తెలిసిపోతుంది. మీరు మీ పాన్ కార్డ్ హిస్టరీని తనిఖీ చేయాలనుకుంటే.. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయిపోండి.


  1. మీరు పాన్ కార్డ్ పాత లావాదేవీల ఆన్‌లైన్ ప్రక్రియను తనిఖీ చేయవచ్చు.

  2. దీని కోసం, మీరు ముందుగా https://www.cibil.com/ వెబ్‌సైట్‌పై క్లిక్ చేయండి.

  3. తర్వాత గెట్ యువర్ సిబిల్ స్కోర్‌పై క్లిక్ చేయండి.

  4. సిబిల్ స్కోర్‌ని తనిఖీ చేయడానికి ముందు.. మీరు ఇక్కడ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ని ఎంచుకోవడం ద్వారా చెల్లింపు చేయాలి.

  5. తదుపరి మీరు మీ మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ వంటి అన్ని వివరాలను పూరించాలి.

  6. ఆపై లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ జనరేట్ చేసిన తర్వాత 'ఇన్ కమ్ ట్యాక్స్ ఐడీ'ని ఎంచుకోవాలి.

  7. తర్వాత మీ పాన్ నంబర్‌ను ఎంటర్ చేయండి. వెరిఫై యువర్ ఐడెంటిటీ ఎంపికపై క్లిక్ చేయండి.

  8. ఆ తరువాత మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ తర్వాత మీ సిబిల్ స్కోర్ ఏమిటో మీకు తెలుస్తుంది.

  9. దీంతో పాటు మీరు మీ పాన్ కార్డ్ ఉపయోగించి ఎన్ని లోన్లు తీసుకున్నారో పాన్ కార్డ్ హిస్టరీలో మీరు చూస్తారు.

  10. మీరు తీసుకోని రుణం ఏదైనా ఉంటే.. మీరు పాన్ కార్డ్ హిస్టరీ నుంచి దాన్ని ట్రాక్ చేయవచ్చు.


పాన్ కార్డ్ దుర్వినియోగంపై మీ ఫిర్యాదును నమోదు చేయండి


మీ పాన్ కార్డ్ హిస్టరీని చెక్ చేసినప్పుడు.. మీరు చేయని ఏదైనా తప్పుడు లావాదేవీని మీరు చూసినట్లయితే వెంటనే దాని గురించి ఆదాయపు పన్ను శాఖకు ఫిర్యాదు చేయవచ్చు. మీ ఫిర్యాదును నమోదు చేయడానికి.. దాని అధికారిక వెబ్‌సైట్ https://incometax.intelenetglobal.com/pan/pan.aspపై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ అన్ని వివరాలను ఎంటర్ చేయండి. ఆ తరువాత మీ ఫిర్యాదును నమోదు చేయండి. దీని తర్వాత ఈ ఫిర్యాదుకు సంబంధించిన అన్ని వివరాలను సమర్పించండి. ఆదాయపన్ను శాఖ మీ ఫిర్యాదును నమోదు చేసుకుని.. తగిన చర్యలు తీసుకుంటుంది.


Also Read: చెన్నై జట్టులోకి బెన్ స్టోక్స్‌.. ఇక ఎంఎస్ ధోనీ ఉంటాడా! సీఎస్‌కే సీఈఓ ఏమన్నాడంటే


Also Read: Ind Vs Ban: రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.