Personal Loan Rules: రుణాలు చాలా రకాలుగా ఉంటాయి. హౌసింగ్ లోన్స్, గోల్డ్ లోన్స్, అగ్రికల్చర్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, పర్సనల్ లోన్స్. అన్నింటికంటే సులభమైనవి, త్వరగా మంజూరయ్యేవి పర్సనల్ రుణాలు. ఇవి ఆయా వ్యక్తుల ఆదాయ పరిమితిని బట్టి ఉంటాయి. కానీ డబ్బు అత్యవసరమైనప్పుడు వెంటనే చేతికి అందేవి ఇవే. అయితే వ్యక్గిగత రుణాలు మంజూరయ్యేందుకు ఎంత సమయం పడుతుందనే సందేహాలుంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వ్యక్తిగత రుణాలనేవి గ్యారంటీ రహిత రుణాలు. మిగిలిన అన్నింటికీ ఏదో రూపంలో గ్యారంటీ అవసరమౌతుంటుంది. మొదటిసారి వ్యక్తిగత రుణాల కోసం అప్లై చేసినప్పుడు కొన్ని ప్రాధమిక ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. మీ అడ్రస్ వెరిఫికేషన్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ వెరిఫికేషన్ ఉంటుంది. బ్యాంక్ ఎక్కౌంట్ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆ తరువాత మీ ఆదాయానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలి. అన్నింటికంటే ముఖ్యంగా సిబిల్ స్కోల్ మీ పాన్‌కార్డు ఆధారంగా ఎంత ఉందో తెలుసుకుంటారు. సిబిల్ స్కోరు బాగుంటే కచ్చితంగా వ్యక్తిగత రుణాలు మంజూరవుతాయి. 


వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు ప్రక్రియ కొద్ది నిమిషాల వ్యవదిలోనే పూర్తవుతుంది. మీ సిబిల్ స్కోర్, మీ ఆధాయాన్ని బట్టి రుణం మంజూరవుతుంది. అన్ని నిర్దేశిత ప్రమాణాలు ప్రకారం ఉంటే వెంటనే అంటే గంటల వ్యవధిలోనే రుణం మంజూరై మీ బ్యాంకు ఎక్కౌంట్‌కు బదిలీ అవుతుంది. బ్యాంక్ ఎక్కౌంట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు కొన్ని బ్యాంకులు 1-2 రోజులు సమయం తీసుకుంటాయి. 


మార్కెట్‌లో ఆన్‌లైన్ పర్సనల్ లోన్స్ యాప్స్ చాలా ఉన్నాయి. అందులో ఆర్బీఐ ధృవీకరించిన లోన్ యాప్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తే మంచిది. లేకపోతే చాలా సమస్యలు, వేధింపులు ఎదుర్కొంటారు. 


Also read: NPS New Rules: నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో కొత్త రూల్స్, ఏప్రిల్ 1 నుంచి అమలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook