Petrol price Today: సామాన్యులపై మళ్లీ పెట్రో వాత.. 7 రోజుల్లో ఆరోసారి ధరల పెంపు
Petrol price Today: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతూ సామాన్యుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. సోమవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో ప్రస్తుత ధరలు ఇలా ఉన్నాయి.
Petrol Price in India: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఆగటం లేదు. సోమవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు తగ్గట్లు.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరించినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు చెబుతున్నాయి. దీనితో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు రూ.110 స్థాయిని దాటేశాయి. డీజిల్ ధరలు రూ.100కు చేరువలో ఉన్నాయి. వరుస గా పెరుగుతున్న దరలు సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నాయి.
దేశవ్యాప్తంగా.. సోమవారం పెట్రోల్ ధరలు 28-34 పైసల మధ్య డీజిల్ ధరలు 33 నుంచి 38 పైసల మధ్య ప్రియమైంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం గత ఏడు రోజుల్లో ఇది ఆరో సారి.
దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ 30 పైసలు పెరిగింది. దీనితో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.99.45 వద్ద ఉంది. ఇక డీజిల్ ధర 35 పైసలు పెరిగి.. రూ.90.81 వద్ద విక్రయమవుతోంది.
హైదారాబాద్, వైజాగ్‌లో రేట్లు..
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్ 34 పైసలు పెరిగి రూ.112.28 వద్దకు చేరింది. లీటర్ డీజిల్ ధర 38 పైసలు పెరిగి.. రూ.99.06 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 33 పైసలు, 36 పైసల చొప్పున పెరిగాయి. దీనితో లీటర్ పెట్రోల్ ధర రూ.113.41 వద్ద, డీజిల్ ధర లీటర్ రూ.99.45 వద్ద ఉన్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు..
చెన్నైలో పెట్రోల్ ధర లీటర్ రూ.105.16 వద్ద (28 పైసలు పెరిగింది) ఉంది. లీటర్ డీజిల్ ధర 33 పైసలు పెరిగి 95.31 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో పెట్రోల్ ధర 32 పైసలు పెరిగి లీటర్ రూ.104.76 వద్ద విక్రయమవుతోంది. లీటర్ డీజిల్ ధర 34 పైసలు పెరిగి రూ.89 వద్దకు చేరింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర లీటర్ రికార్డు స్థాయి వద్ద ఉన్నాయి. లీటర్ పెట్రోల్ ధర 31 పైసలు పెరిగి.. రూ.114.17 వద్ద ఉంది. లీటర్ డీజిల్ ధర 37 రూ.98.48 వద్ద కొనసాగుతోంది.
కోల్‌కతాలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 32 పైసలు, 35 పైసల చొప్పున పెరిగింది. దీనితో లీటర్ పెట్రోల్ రూ.108.83 వద్ద, డీజిల్ లీటర్ రూ.93.9 వద్ద ఉన్నాయి.
Also read: PVR-Inox Mega Merger: మల్టీప్లెక్స్ ఇండస్ట్రీలో మెగా విలీనం... ఒక్కటైన పీవీఆర్, ఐనాక్స్
Also read: Ola E-scooter Fire: ఓలా ఈ-స్కూటర్లో మంటలు- వైరల్ అవుతున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook