Petrol Diesel Price Hike: దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్ చొప్పున 40 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ ధర రూ. 103.41కు చేరగా.. డీజిల్ ధర రూ. 95.07గా ఉంది. గడిచిన 14 రోజుల వ్యవధిలో ఇంధన ధరలు 12 సార్లు పెరిగాయి. దీంతో లీటర్ పెట్రోల్ పై రూ. 8.40 మేర భారం పడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర 42 పైసలు పెరగడం వల్ల రూ. 118.81కు చేరుకుంది. దీంతో పాటు డీజిల్ పై 43 పైసలు పెరగడం వల్ల రూ. 103.05కు ఎగబాకింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ. 109.32 ధరకు విక్రయిస్తుండగా.. డీజిల్ ధర రూ. 99.4కు చేరింది. కోల్ కతాలో లీటర్ పెట్రోల్ రూ. 113.43గా ఉండగా.. డీజిల్ ధర రూ. 98.21కు చేరుకుంది. 


తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..


హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ పై 45 పైసల పెంపుతో ధర రూ. 117.68 చేరుకోగా.. లీటర్ డీజిల్ ధర రూ. 103.75కు ఎగబాకింది. మరోవైపు గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర 44 పైసలు పెరిగిన నేపథ్యంలో దీని ధర రూ. 119.51కు చేరింది. డీజిల్ ధర 41 పైసలు పెరిగి రూ. 105.2 వద్ద ఉంది.  


Also Read: Royal Enfield Electric Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలోనే మార్కెట్లోకి RE ఎలక్ట్రిక్ బైక్!


Also Read: Petrol Diesel Price Hike: ఆగని పెట్రో బాదుడు.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook