Petrol price on March 27th 2022 was hiked by 50 paise a litre, diesel by 55 paise: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు రోజురోజుకూ పెంచుతూ పోతున్నాయి. గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఈరోజు కూడా పెరిగాయి. ఆదివారం (మార్చి 27) లీటర్‌ పెట్రోల్‌పై 50 పైసలు, డీజిల్‌ పై 55 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గడిచిన ఆరు రోజుల్లో చమురు ధరలు పెరగడం ఇది ఐదోసారి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో.. ఇంధన ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజా పెంపుతో దేశ రాజధాని డిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.99.11లుగా ఉండగా.. డీజిల్‌ ధర రూ.90.42గా కొనసాగుతోంది. ముంబైలో పెట్రోల్‌ ధర రూ.113.88, డీజిల్‌ ధర రూ.98.13గా ఉంది. చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.104.90గా.. డీజిల్‌ ధర రూ.95.00 వద్ద కొనసాగుతోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్ ధర రూ.112.35, లీటర్‌ డీజిల్ ధర రూ.98.68గా ఉంది. ఇక విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.113.08, డీజిల్ ధర రూ.99.09 వద్ద కొనసాగుతోంది. 


అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా.. రికార్డు స్థాయిలో 137 రోజులు పెట్రోలు, డీజిల్‌ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. అంతర్జాతీయంగా బ్యారెల్ ధర నవంబరులో 82 డాలర్లుగా ఉండగా.. మార్చి ఆరంభంలో 111 డాలర్లకు చేరింది. ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఓ సమయంలో బ్యారెల్‌ ధర 139 డాలర్లకు కూడా చేరింది. అయినప్పటికీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ధరల్లో మార్పులు చేయలేదు. 


పెట్రోలు, డీజిల్‌ రేట్లలో మార్పు చేయకపోవడం వల్ల ఇంధన రిటైలర్లయిన ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌లకు 2.25 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.19,000 కోట్ల) నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత (మార్చి 10 తర్వాత) ఇంధన ధరలు పెరుగుతాయని అందరూ భావించినప్పటికీ.. దాదాపుగా రెండు వారాల పాటు వాయిదా పడింది. గత ఆరు రోజులుగా పెట్రో బాదుడు మొదలైంది. ధరల పెంపు ప్రారంభమైన తర్వాత లీటర్‌ పెట్రల్‌ ధర రూ.3.70, డీజిల్‌ 3.75 వరకు పెరిగింది. ఇంధన ధరలు 120 నుంచి 125 వరకు పెరుగుతాయని అంచనా. 


Also Read: Allu Arjun Car: టాలీవుడ్ సెలెబ్రిటీల కార్లకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల జరిమానా


Also Read: CSK vs KKR Turning Point: మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. అంతా జడేజానే చేశాడు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook