Petrol Price in India: రెండు రోజుల గ్యాప్ తర్వాత దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధరలకు అనుగుణంగానే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరించినట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు చెబుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాహనదారులు మాత్రం పెరిగిన ధరల వల్ల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోతున్నారు.


ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ రేట్లు


హైదరాబాద్​లో పెట్రోల్ (Petrol price in Hyderabad) ధర లీటర్​ 36 పైసలు పెరిగి.. రూ.112.23 వద్దకు చేరింది. లీటర్ డీజిల్ ధర (Diesel Price in Hyderabad) 38  పైసలు పెరిగి.. రూ.105.42 వద్ద ఉంది.


విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్​, డీజిల్ ధరలు 36, 37 పైసల చొప్పున పెరిగాయి. ప్రస్తుతం పెట్రోల్ ధర (Petrol price in Vizag) రూ.112.98 వద్ద, డీజిల్ ధర (Diesel price in Vizag) రూ.105.60 వద్ద ఉన్నాయి.


Also readCheapest Fuel Price: ఆ దేశంలో అగ్గిపెట్టె డబ్బులతో లీటర్ పెట్రోల్ కొనవచ్చు


Also read:Gold Price Today: మళ్లీ భారీగా పెరిగిన బంగారం, 5 వందల వరకూ పెరుగుదల


ఇతర మెట్రో నగరాల్లో ఇంధన ధరలు..


దేశ రాజధాని ఢిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర (Petrol Price in Delhi) 35 పైసలు, డీజిల్ ధర లీటర్​ 35 పైసలు పెరిగింది. దీనితో పెట్రోల్, డీజిల్ (Diesel Price in Delhi) ధరలు లీటర్​కు వరుసగా.. రూ.107.94, రూ.96.68 వద్ద ఉన్నాయి.


చెన్నైలో పెట్రోల్ ధర (Petrol Price in Chenni) లీటర్​ 30 పైసలు పెరిగి.. రూ.104.79 వద్ద ఉంది. లీటర్ డీజిల్ (Diesel Price in Chenni) ధర 34 పైసలు పెరిగి.. రూ.100.89 వద్దకు చేరింది.


బెంగళూరులో పెట్రోల్ ధర (Petrol Price in Bengaluru) లీటర్​ 36 పైసలు పెరిగి రూ.111.66 వద్ద కొనసాగుతోంది. లీటర్ డీజిల్ ధర 37 పైసలు పెరిగి (Diesel Price in Bengaluru) రూ.102.57 వద్దకు చేరింది.


దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర లీటర్​ 34 పైసలు పెరిగి (Petrol Price in Mumbai)రూ.113.76కి చేరింది. లీటర్ డీజిల్ ధర 37 పైసలు పెరిగి రూ.104.71 వద్ద (Diesel Price in Mumbai) కొనసాగుతోంది.


కోల్​కతాలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా లీటర్​కు.. 34 పైసలు, 35 పైసల చొప్పున పెరిగాయి. దీనితో లీటర్​ (Petrol Price in Kolkata) పెట్రోల్ ధర రూ.108.41 వద్దకు చేరింది. డీజిల్ ధర లీటర్​ (Diesel Price in Kolkata) రూ.99.75 వద్ద కొనసాగుతోంది.


రాజస్థాన్​లోని గంగానగర్​లో పెట్రోల్​, డీజిల్ ధరలు రికార్డు స్థాయి వద్ద ఉన్నాయి. అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.120.60 వద్ద కొనసాగుతోంది. లీటర్ డీజిల్ ధర రూ.110.92 వద్ద ఉంది.


Also read: Fact check: కరోనా వ్యాక్సిన్ తీసుకోకుంటే Ration, Pension cut.. ఇందులో నిజమెంత ?


Also read: T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ దిశగా పాకిస్తాన్, 4 పాయింట్లతో అగ్రస్థానం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook