ఇంధన ధరల విషయంలో సాధారణ, మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. చాలాకాలంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గకుండా, పెరగకుండా స్థిరంగా కొనసాగుతుండగా..కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీ చేసిన వ్యాఖ్యలు కాస్త ఉపశమనం కల్గిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఇంధన వినియోగ దేశంగా ఇండియా ఉంది. ఈ క్రమంలో ఇండియాలో పెట్రోల్-డీజిల్ ధరలు త్వరలో తగ్గవచ్చని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీ తెలిపారు. ఆయిల్ ఎక్కడైతే చౌక ధరకు లభిస్తాయో ఆ దేశాల్నించి ఇండియా కొనుగోలు చేస్తుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఇండియా ఎనర్జీ వీక్‌లో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఇంధన సెక్యూరిటీతో పాటు ప్రజలకు చౌక ధరకు పెట్రోల్, డీజిల్ అందింంచేలా చర్యలు చేపడతామన్నారు. అదే సమయంలో గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్‌లో భారతదేశం వహించే భూమికపై ప్రధాని మోదీకి ప్రత్యేకమైన విజన్ ఉందన్నారు. 


భారతదేశం తన ఇంధన అవసరాల్లో 85 శాతం, నేచురల్ గ్యాస్‌లో 50 శాతం దిగుమతులతో పూర్తి చేసుకుంటోందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇక చెరుకు ఇతర వ్యవసాయాల ద్వారా లభించే ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలుపుతున్నారని..తద్వారా దిగుమతిపై ఆధారపడటం తగ్గుతుందన్నారు. ప్రస్తుతం ఇంధనాన్ని పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటున్నామన్నారు. 


2025 వరకూ 20 శాతం కలవనున్న ఇథనాల్


ఇతర దేశాల్లో ఆధారపడటాన్ని తగ్గించేందుకు 2025 వరకూ పెట్రోల్‌లో 20 శాంత ఇథనాల్ కలపడం భారత ప్రభుత్వ లక్ష్యమన్నారు దేశాన్ని గ్రీన్ ఎనర్జీ రంగంలో ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఉందని కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరి తెలిపారు. ఇండియా ఎనర్జీ వీక్‌ను దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇండియా ఎనర్జీ రంగంలో వేగంగా ముందుకు దూసుకెళ్తోందని మోదీ చెప్పారు. ఈ రంగంలో చాలా అవకాశాలున్నాయని చెప్పారు. కరోనా మహమ్మారి తరువాత కూడా దేశంలో వివిధ రకాల సౌకర్యాలు లభిస్తున్నాయని చెప్పారు. 


39 దేశాల్నించి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న ఇండియా


ఇండియా ప్రస్తుతం ఆయిల్ కొనుగోలుకు అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ప్రస్తుతం ఇండియా మార్కెట్ కార్డ్ ఉపయోగిస్తోందని కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీ చెప్పారు. ఎక్కడైతే తక్కువ ధరకు ఆయిల్ లభిస్తుందో అక్కడి నుంచే ఇండియా కొనుగోళ్లు జరుపుతోందని చెప్పారు. 2006-07లో ఇండియా 27 దేశాల్నించి ఆయిల్ దిగుమతి చేసుకోగా, 2021-22 నాటికి ఈ సంఖ్య 39కి పెరిగిందన్నారు. అంటే ప్రస్తుతం ఇండియా 39 దేశాల్నించి ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. ఇందులో కొలంబియా, రష్యా, లిబియా, గైబన్, ఇక్వేటోరియల్ గిని ఉన్నాయి. 


Also read: Repo Rate: రెపో రేటు అంటే ఏమిటి, రెపో రేటు పెరిగితే ఈఎంఐ ఎందుకు పెరుగుతుంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook