Petrol price: పెట్రోల్, డీజిల్ రేట్లు రోజు రోజుకు మండిపోతున్నాయి. ధరలు పెరుగుతుండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు గత కొన్ని రోజులుగా.. నూతన రికార్డు స్థాయికి చేరడంతో ప్రజలు ప్రభుత్వంపై ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ధరలు ఎలా ఉండేవి? ఇప్పుడు ధరలు ఎలా ఉన్నాయి? అనే విషయాన్ని పోల్చి చూస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదే విషయంపై కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ కూడా ఓ ఫొటోను ట్విట్టర్​లో షేర్ చేశారు. అందులో 2014 మే సమయంలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయి? ప్రస్తుత ధరలు ఎంత? అనే వివరాలు ఉన్నాయి. దీనిపై మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం.


పెట్రోల్, డీజిల్ ధరలు పోలిక..


ప్రస్తుతం ఒక స్కూటర్​ లేదా బైక్ ఫుల్​ ట్యాంక్ చేసేందుకు సగటున రూ.1,038 పడుతోంది. ఎన్​డీఎ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తొలినాళ్లలో ఈ మొత్తం రూ.714గా ఉండేది. అంటే గడిచిన 8 ఏళ్లలో రూ.324 వరకు ధర పెరిగింది.


కారును ఫుల్​ ట్యాంక్ చేయించేందుకు 2014 మే సమయంలో రూ.2,856 వరకు ఖర్చయ్యేది. ఇప్పుడు సగటున రూ.4,152 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. అంటే రూ.1,296 వరకు ధరలు పెరిగాయి.


ట్రాక్టర్​లో డీజిల్ ట్యాంక్​ ఫుల్ కొట్టించేందుకు.. 2014తో పోలిస్తే (రూ.2,749) రూ.1,814 పెరిగి.. ప్రస్తుతం రూ.4,563 వరకు చేరినట్లు తెలిసింది.


వాణిజ్య అవసరాలకు వాడే ట్రక్కుల వంటి భారీ వాహనాలకు ఫుల్​ ట్యాక్ చేయించేందుకు (డీజిల్​) 2014 సమయంలో రూ.11,456 వరకు ఖర్చయ్యేది. ప్రస్తుతం ఈ మొత్తం రూ.7,558 వరకు పెరిగి.. రూ.19,014 వరకు చేరింది.



ముడి చమురు ధర


మరో విషయమేమిటంటే.. 2014 మే 26న బ్యారెల్ ముడి చమురు ధర 108.05 డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్​ ఆయిల్ రేటు 99.42 వద్ద ఉంది.


Also read: Channels block: నకిలీ వార్తలు ప్రసారం.. 22 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం వేటు


Also read: Whats App: వాట్సాప్‌ సంచలన నిర్ణయం.. మెసేజ్ ఫార్వర్డ్‌ చేయడం ఇక నుంచి కుదరదు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


pple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook