How to Check EPF Balance in Telugu: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త అందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేటును పెంచింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్‌పై 8.15 శాతం వడ్డీ రేటును అందించేందుకు ఆమోదం తెలిపింది. దీంతో 5 కోట్ల మంది ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వడ్డీ రేటును పెంచుతున్నట్లు సోమవారం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) సోమవారం సర్క్యులర్ జారీ చేసింది. ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) ప్రతిపాదించిన 8.15 శాతం వడ్డీ రేటును పెంచేందుకు కేంద్ర అంగీకారం తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెరిగిన వడ్డీ ప్రకారం త్వరలోనే ఉద్యోగుల పీఎఫ్ అకౌంట్‌లలోకి డబ్బులు జమ కానున్నాయి. ఈపీఎఫ్‌ఓ ​​ప్రాంతీయ కార్యాలయాలు వడ్డీని యాడ్ చేయనున్నాయి. మిస్డ్ కాల్, ఎస్‌ఎంఎస్, ఉమాంగ్ యాప్‌, ఈ-సేవా పోర్టల్‌ ద్వారా ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు. సింపుల్‌గా ఈ కింది స్టెప్స్ ఫాలో అయిపోయి మీ బ్యాలెన్స్ తనిఖీ చేసుకోండి. 


ఎస్ఎంఎస్/ మిస్ట్ కాల్ ద్వారా..


మీ బ్యాంక్, ఆధార్, మొబైల్ నంబర్ యూఏఎన్‌తో లింక్ అయి ఉండాలి. EPFOHO UAN అని టైప్ చేసి మీ రిజిస్టర్ మొబైల్ నంబరు నుంచి 7738299899కి మెసేజ్ చేయండి. మీకు ఇంగ్లిష్‌లో బ్యాలెన్స్ వివరాలు వస్తాయి. తెలుగులో వివరాలు కావాలని అనుకుంటే.. 7738299899కి EPFOHO UAN TEL అని టైప్ చేసి సందేశం పంపించండి. మీ పీఎఫ్‌ బ్యాలెన్స్ వివరాలు తెలుగులో వస్తాయి. లేదా 9966044425 నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే.. ఈపీఎఫ్‌ బ్యాలెన్స్ వివరాలు మెసేజ్ రూపంలో మీ మొబైల్ నంబరుకు వస్తాయి.


ఉమాంగ్ యాప్‌ ద్వారా.. 


==> ప్లే స్టోర్/యాప్ స్టోర్ నుంచి ఉమాంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
==> మీ ఫోన్‌లో ఉమాంగ్‌ను యాప్‌ని ఓపెన్ చేసి మీకు నచ్చిన భాషను ఎంచుకోండి 
==> నిబంధనలు, షరతులను చదివిన తరువాత మీ మొబైల్ నంబర్‌ని ధృవీకరించి.. లాగిన్ అవ్వండి.
==> అన్ని సేవలు అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఈపీఎఫ్‌ఓను ​​ఎంచుకోండి.
==> ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవడానికి 'View Passbook' ఆప్షన్‌ను ఎంచుకోండి
==> మీ యూఏఎన్‌ను ఎంటర్ చేసి.. గెట్ OTPపై క్లిక్ చేయండి.
==> మీ నంబరుకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి.. సబ్మిట్‌పై క్లిక్ చేయండి.
==> మీరు ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవాలనుకుంటున్న కంపెనీ ఐడీని ఎంచుకోండి.
==> బ్యాలెన్స్‌తో పాటు మీ పాస్‌బుక్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.


ఈపీఎఫ్‌ఓ పోర్టల్ ద్వారా..


==> ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్ www.epfindia.gov.inని సందర్శించండి.
==> 'మా సేవలు' డ్రాప్ డౌన్ మెను  నుంచి 'ఉద్యోగుల కోసం'పై క్లిక్ చేయండి
==> 'సర్వీసెస్' ఆప్షన్‌ కింద 'సభ్యుని పాస్‌బుక్' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
==> మీ యూఏఎన్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
==> ఈపీఎఫ్‌ బ్యాలెన్స్ చెక్ చేయాలనుకుంటున్న అకౌంట్ మెంబర్ ఐడీపై క్లిక్ చేయండి
==> స్క్రీన్‌పై మీ బ్యాలెన్స్ వివరాలు కనిపిస్తాయి.


Also Read: Bank Holiday August 2023: ఆగస్టు నెలలో 14 రోజులు బ్యాంకులు బంద్.. సెలవుల జాబితా ఇదే..!  


Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి