PF Withdrawal: పీఎఫ్ నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి
PF Withdrawal Process Online 2023: మీరు పీఎఫ్ అకౌంట్ నుంచి నగదు విత్ డ్రా చేస్తున్నట్లయితే కచ్చితంగా కొన్ని విషయాలు ముందే తెలుసుకోవాలి. ముఖ్యంగా మీ యూఏఎన్‌తో ఆధార్, బ్యాంక్ వివరాలు లింక్ అయ్యాయో లేదో చెక్ చేసుకోవాలి. పూర్తి వివరాలు ఇలా..
PF Withdrawal Process Online 2023: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వారి జీతంలో ప్రతి నెల కొంత డబ్బులు కట్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)లోకి జమ అవుతుంది. ఈ డబ్బుకు కంపెనీ కూడా మరికొంత అమౌంట్‌ను జమ చేస్తుంది. పదవీ విరమణ తరువాత ఉద్యోగులు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది పడకుండా ఈ డబ్బులతో హ్యాపీగా జీవితాన్ని గడపవచ్చు. అయితే ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా కొందరు రిటైర్‌మెంట్ కంటే ముందే పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకుంటున్నారు. అయితే పీఎఫ్ ఖాతా నుంచి మొత్తం డబ్బును ఉపసంహరించుకునే అవకాశం ఉండదు.
ప్రావిడెండ్ ఫండ్‌లో నగదును రిటైర్‌మెంట్ కంటే ఒక ఏడాది ముందు విత్ డ్రా చేసుకుంటున్నట్లయితే.. మీరు 90 శాతం డబ్బు తీసుకోవచ్చు. అయితే మధ్య మీకు ఉద్యోగం లేకపోతే.. ఒక నెల నిరుద్యోగం తరువాత 75 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన సందర్భాల్లో మీరు కొంత అమౌంట్‌ను పీఎఫ్ నుంచి ఉపసంహరించుకోవచ్చు. నగదు తీసుకోవాలంటే.. యూఏఎన్ నంబరు కరెక్ట్‌గా ఉండాలి. ఆధార్, పాన్‌తో సహా మీ బ్యాంక్ వివరాలను తప్పనిసరిగా మీ యూఏఎన్‌కు లింక్ చేసి ఉండాలి.
==> మీ బ్యాంక్ వివరాలను వెరీఫై చేయాల్సి ఉంటుంది.
==> మీరు ఉంటున్న అడ్రస్ వివరాలను అందజేయాలి.
==> క్యాన్సిల్ చెక్ లేదా అప్‌డేట్ అయిన బ్యాంక్ పాస్‌బుక్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది
==> ఉద్యోగి ఐదేళ్ల నిరంతర సర్వీసుకు ముందు ఈపీఎఫ్‌ను ఉపసంహరించుకుంటే.. ఐటీఆర్ ఫారం 2, ఫారం 3 అవసరం అవుతాయి.
==> అన్ని వివరాలతో నింపింని ఈపీఎఫ్ క్లెయిమ్ ఫారమ్.
Also Read: TDP-BJP Alliance: టీడీపీతో పొత్తుపై క్లారిటీ ఇచ్చేసిన బండి సంజయ్..!
ముఖ్య గమనిక: ఆన్‌లైన్‌లో మీరు ఈపీఎఫ్ అకౌంట్ నుంచి నగదు ఉపసంహరించుకోవడానికి మీ మొబైల్ నంబర్‌ను మీ ఆధార్ కార్డ్ నంబర్‌తో కచ్చితంగా లింక్ చేసి ఉండాలి. అన్ని వివరాలు పూర్తి సబ్మిట్ చేసే సమయంలో మీ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుంది. కచ్చితంగా ఆ ఓటీపిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ కోసం మీ పాత కంపెనీ లేదా ఈపీఎఫ్‌ఓ కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి