PM Kisan Samman Nidhi Yojana 15th Instalment: దేశంలో రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న గుడ్‌న్యూస్ వచ్చేసింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 15వ విడత నిధులు రేపు లబ్ధిదారుల అకౌంట్‌లో జమకానున్నాయి. 8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేలు జమకానున్నాయి. పీఎం కిసాన్ స్కీమ్ కింద ప్రతి ఏడాది రూ.6000 చొప్పున కేంద్రం అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు మొత్తం 14 వాయిదాల్లో రూ.2 వేల చొప్పున జమ చేయగా.. బుధవారం 15వ విడత నిధులను విడదల చేయనుంది. 14వ విడతను జూలై 27న పీఎం మోదీ విడుదల చేశారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు కేంద్రం ఇప్పటివరకు మొత్తం రూ.2.50 లక్షల కోట్లను బదిలీ చేసింది. ఈ స్కీమ్‌కు అర్హులైన వారు కచ్చితగా ఈకేవైసీ పూర్తి చేసుకుని ఉండాలి. ఈకేవైసీ పూర్తిచేసిన వారినే లబ్ధిదారుల జాబితాలో చేర్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్టాటస్‌ను ఇలా చెక్ చేసుకోండి..


==> ముందుగా అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in కు లాగిన్ అవ్వండి
==> హోమ్ పేజీలో రైట్‌ సైడ్‌లో ఉన్న 'నో యువర్ స్టేటస్' ట్యాబ్‌పై క్లిక్ చేయండి
==> మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి.. క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి. 'డేటా పొందండి' ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.
==> లబ్ధిదారుల స్టాటస్ స్క్రీన్‌పై ప్రత్యక్షం అవుతుంది.


జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చూసుకోండి


==> ముందుగా www.pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
==> 'బెనిఫిషియరీ లిస్ట్' ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
==> డ్రాప్-డౌన్ నుంచి రాష్ట్రం, జిల్లా, సబ్ డిస్టిక్ట్, బ్లాక్, గ్రామం వంటి వివరాలను ఎంచుకోండి
==> 'గెట్ రిపోర్ట్' ట్యాబ్‌పై క్లిక్ చేయండి


ఎలా నమోదు చేసుకోవాలి


==> pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వండి.
==> కొత్త రైతు రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేసి ఆధార్ నంబర్‌ను నమోదు చేసి క్యాప్చాను ఎంటర్ చేయండి
==> ఆ తరువాత వివరాలను నమోదు చేసి.. YES అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి
==> పీఎం కిసాన్ దరఖాస్తు ఫారమ్ 2023లో అడిగిన సమాచారాన్ని పూరించండి. దానిని సేవ్ చేసుకోండి. భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోండి.


Also Read: 7th Pay Commission: దీపావళికి రాష్ట్ర ప్రభుత్వాలు గిఫ్ట్.. ఏ రాష్ట్రం ఎంత జీతం పెంచిందంటే..?


Also Read: Diabetes Control Tips: మధుమేహం వ్యాధిగ్రస్థులు రోజూ మెంతి నీళ్లు ఎందుకు తాగాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి