Update on PM Kisan APP: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ ప్రాసెస్ సులభతరం
Update on PM Kisan: పీఎం కిసాన్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ఫీచర్‌ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ ఫీచర్ ద్వారా రైతులు చాలా రకాల ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా e-KYC ప్రాసెస్ ఈ ఫీచర్ వల్ల మరింత సులభతరమైంది.
Face Authentication Feature in Pm Kisan App: రైతులు పండించే పంటకు పెట్టుబడి సహాయంగా ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేస్తోంది. ఈ పథకం ద్వారా ప్రతి రైతు రూ. 6000 లబ్ధి పొందుతాడు. అయితే రైతు ఖాతాల్లోని డబ్బులు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రక్రియను మరింత సులభతరం చేసింది.
ఇందులో భాగంగానే పీఎం కిసాన్ యాప్ ను కూడా లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కేంద్రం ఈ యాప్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసింది. కొత్తగా ఫేస్ అథెంటికేషన్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికీ కేంద్ర సంక్షేమ కార్యక్రమంలో ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ ఫీచర్ యాప్స్ లో ఇదే మొదటిదవ్వడం విశేషం.
ఇక రైతులంతా ఎప్పటినుంచో ఈ కేవైసీ కోసం ఎదురుచూస్తున్న వారు సులభంగా వారి మొబైల్స్ లోనే e-KYC ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు. ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రధాన కారణాలు.. కిసాన్ లబ్ధిదారులైన రైతుల ఖాతాలోకి డబ్బులు సులభంగా చేరెందుకు ఫీచర్ ని తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.
Also Read: Aadhar Card Photo Change Online Process: 8 ఏళ్ల బాలుడి ఆధార్ కార్డులో డిప్యూటీ సీఎం ఫొటో
ఫేస్ అథెంటికేషన్ ఇలా చేయాల్సి ఉంటుంది..
మీరు అథెంటికేషన్ ఫీచర్ను ఇంటిగ్రేట్ చేసుకునేందుకు డైరెక్ట్ గా మీ దగ్గర ఉన్న మొబైల్ లో ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత డైరెక్ట్ ఈ కేవైసీ ప్రాసెస్ ని ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ కంప్లీట్ చేసుకోవచ్చు.
ఇప్పటివరకు e-KYC ప్రక్రియ చేయని వారికి లాభం:
పల్లె ప్రాంతాల్లో చాలామంది వృద్ధ రైతులు ఇప్పటికీ e-KYC చేసుకొని వారున్నారు. అయితే వీరు ఇకనుంచి ఆధార్ కేంద్రంకు గాని ఈ నెట్ సెంటర్ కు వెళ్లకుండానే సులభంగా ఈ కేవైసీ ప్రక్రియను చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎలాంటి వన్ టైం పాస్వర్డ్లు ఓటీపీలు లేకుండా e-KYC ప్రక్రియ చేసుకునేందుకు వీలుగా ఈ ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే పీఎం కిసాన్ యాప్ లో ఈ అథెంటికేషన్ కు సంబంధించిన ప్రక్రియ పైలెట్ ప్రాజెక్టు కింద మొదలైంది. ఈ పద్ధతిని దేశవ్యాప్తంగా మూడు లక్షల మంది రైతులు వినియోగించుకున్నారని సమాచారం.
Also Read: Train Accident: రెండు గూడ్స్ రైళ్లు ఢీ.. గూడ్స్‌పైకి దూసుకెళ్లిన ట్రైన్ ఇంజిన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook