PM Kisan Yojana: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు అందించే ఆర్థిక సహాయం 10వ విడత విడుదల చేసేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించినట్లు (PM Kisan Samman Nidhi Scheme) తెలుస్తోంది. ఈ నెలలోనే రైతుల ఖాతాల్లో కేంద్రం ఆర్థిక సహాయాన్ని జమ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓ నివేదిక ప్రకారం ఈ నెల 15-25 మధ్య ఈ సహాయాన్ని (PM Kisan Yojana10th instalment ) ప్రకటించే వీలుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏమిటి పథకం..


రైతులు పంట వేసేందుకు పెట్టుబడి సహాయం కింద ఏడాదికి రూ.6 వేల ఆర్థిక సహాయం చేసేందుకు కేంద్రం 2019లో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. రూ.6 వేలను మూడు వాయిదాల్లో (రూ. 2 వేల చొప్పున) రైతుల ఖాతాల్లోనే (Pradhan Mantri Kisan Samman Nidhi Yojana) జమ చేస్తోంది.


ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు తొమ్మది వాయిదాల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది కేంద్రం. మొత్తం ఇప్పటి వరకు ఈ పథకం కోసం రూ.1.58 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఈ పథకం ద్వారా ప్రస్తుతం 11.37 కోట్ల మంది రైతులు లబ్దిపొందుతున్నారు.


అయితే ఈ పథకం ద్వారా చివరిసారి కొంత మంది రైతులు సహాయాన్ని అందుకోలేకపోయారు. దీనితో ఈ సారి వారందరికి రూ.4000 వేల చొప్పున అందించనుంది కేంద్రం.


ఎలా తెలుసుకోవాలి..


  • ముందుగా పీఎం కిసాన్​ వెబ్​సైట్​లోకి లాగిన్ అవ్వాలి (https://pmkisan.gov.in)

  • హోం పేజీలో ఎడమవైపు.. ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్​ను ఎంచుకోవాలి

  • ఇందులో బెనిఫీషియరీ లిస్ట్​ (Beneficiaries List) ఆప్షన్​ను క్లిక్​ చేయాలి

  • ఇక్కడ మీ (రైతు) ఊరు, జిల్లా, రాష్ట్రం వంటి వివరాలు ఎంచుకోవాలి

  • ఆ తర్వాత గెట్​ రిపోర్ట్ (Get Report) ఆప్షన్​పై క్లిక్​ చేయాలి

  • ఈ రిపోర్ట్​లో ఎవరెవరికి సహాయం అందుతుందనే వివరాలు ఉంటాయి. అందులో మీ పేరు ఉంటే.. మీకు సహాయం అందుతుందని అర్థం.


Also read: RBI Key Policy Rates: రిజర్వ్ బ్యాంకు గవర్నర్ కీలక ప్రకటన.. వరుసగా తొమ్మిదోసారి యథాతథంగా వడ్డీ రేట్లు


Also read: Gold Price today: దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook