Pension Scheme: కేంద్రంలోని మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్
PM Modi`s cabinet approves unified pension scheme: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం శనివారం జరిపిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సరికొత్త పెన్షన్ విధానాన్ని అమలులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
PM Modi's cabinet approves unified pension scheme: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కొనసాగుతున్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అదేవిధంగా న్యూ పెన్షన్ స్కీం స్థానంలో యూనిఫాడ్ పెన్షన్ స్కీమ్ (UPS)అమలు చేయనున్నట్లు తెలిపింది. ఈ పెన్షన్ స్కీం 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ స్కీం ద్వారా సుమారు 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ క్యాబినెట్ సమావేశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీడియాకు తెలిపారు. అందులో ఆయన ప్రధానంగా ఈ యుపిఎస్ పెన్షన్ స్కీమ్ కింద 25 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగికి పూర్తి పెన్షన్ అందించనున్నట్లు తెలిపింది. ఈ పెన్షన్ స్కీం కింద దాదాపు 10,579 కోట్లు అదనంగా ఖర్చవుతుందని ఆయన పేర్కొన్నారు.
యూనిఫైడ్ పెన్షన్ స్కీం గురించి తెలుసుకుందాం:
- ఈ పథకం కొన్ని ప్రధాన లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి:
- కనీసం 25 ఏళ్లు పనిచేసిన వారికి పదవీ విరమణకు ముందు గత 12 నెలల్లో సగటు బేసిక్ వేతనంలో 50 శాతం పెన్షన్‌గా ఇస్తారు.
- కనీసం 10 సంవత్సరాలు పనిచేసిన వారికే యూనిఫైడ్ పెన్షన్ స్కీం అందుతుంది.
-ఎవరైనా పదేళ్ల సర్వీసు తర్వాత ఉద్యోగం వదిలేస్తే కనీసం రూ.10వేలు పెన్షన్‌గా అందుతుంది.
- ఉద్యోగి మరణించినప్పుడు, అతని కుటుంబానికి అతని పెన్షన్ మొత్తంలో 60 శాతం అందుతుంది.
- గ్రాట్యుటీతో పాటు, పదవీ విరమణపై ఒకేసారి మొత్తం చెల్లింపు కూడా చేయబడుతుంది.
మీరు ద్రవ్యోల్బణ సూచిక ప్రయోజనాన్ని కూడా పొందుతారు.
- ఉద్యోగులు సహకరించాల్సిన అవసరం లేదు. ఉద్యోగుల మూల వేతనంలో 18.5 శాతం ప్రభుత్వం తన వంతుగా భరిస్తుంది.
- ప్రతి ఆరు నెలల సర్వీస్‌కు, పదవీ విరమణ సమయంలో నెలవారీ జీతం (జీతం + డీఏ)లో పదోవంతు జోడించనున్నారు.
Also Read :EPFO Interest: ఈపీఎఫ్ ద్వారా రూ. 4 కోట్ల ఫండ్ పొందాలంటే.. ప్రతి నెల ఎంత కాంట్రిబ్యూట్ చేయాలి..?
ఇదిలా ఉంటే గత కొన్ని సంవత్సరాలుగా ఓల్డ్ పెన్షన్ స్కీం, న్యూ పెన్షన్ స్కీం పేరిట వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. చాలా మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ స్థానంలో మధ్య మార్గంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమలు చేసేందుకు మోడీ ప్రభుత్వం నడుం బిగించింది. ఈ పెన్షన్ స్కీం కింద కనీసం పదివేల రూపాయల హామీతో పెన్షన్ లభిస్తుంది. ఇదిలా ఉంటే నేడు ఢిల్లీలో జరిగిన కేబినెట్ భేటీలో మోడీ ప్రభుత్వం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా విద్యారంగంలో పలు కీలకమైన మార్పులు తెచ్చేందుకు నడుం బిగించింది. ఇందులో భాగంగా 11, 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు విజ్ఞాన ధార పేరిట సరికొత్త పథకాన్ని రూపొందించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.