Free Electricity Scheme: ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఈ స్కీంతో ఒక్క రూపాయి చెల్లించకుండా ఏడాదంతా ఫ్రీ కరెంట్
PM Surya Ghar Yojana: కరెంటు బిల్లలు భారం నుంచి తప్పించుకోవాలని ఉందా..అయితే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న పీఎం సూర్య ఘర యోజన ద్వారా మీరు రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి పానల్స్ సబ్సిడీ ధరలతో ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ స్కీం గురించి పూర్తి వివరాలు మీకోసం.
PM Surya Ghar Yojana: కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం సామాన్యులు మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్ వినిపించింది. రోజు రోజుకీ పెరుగుతున్న కరెంటు బిల్లులకు స్వస్తి పలుకుతూ శాశ్వత పరిష్కారం అందించింది. అదే పీఎం సూర్య ఘర్ యోజన. ఈ స్కీం కింద దేశవ్యాప్తంగా ఒక కోటి కుటుంబాలకు సోలార్ విద్యుత్ ఏర్పాటుకు సబ్సిడీ ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ స్కీం ద్వారా ఒక్కో ఇంటిపై దాదాపు మూడు కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన సోలార్ ప్యానల్స్ అమర్చుకోవచ్చు. ఈ సోలార్ ప్యానల్స్ పై సుమారు 78000 రూపాయలు వరకు సబ్సిడీ అందిస్తోంది.
ఈ స్కీం ద్వారా మీకు నిరంతరం విద్యుత్ ఉచితంగా లభిస్తుంది. సాధారణంగా మీ ఇంటి పైన మూడు కిలోవాట్ల సోలార్ ప్యానల్ లను అమర్చుకోవాలంటే దాదాపు రూ. 1.50 లక్షల ఖర్చు అవుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనిపై మీకు 78 వేల రూపాయల సబ్సిడీ అందిస్తోంది. మీరు మిగిలిన మొత్తాన్ని కూడా బ్యాంకుల నుంచి లోన్ గా తీసుకోవచ్చు. దేశంలోని ప్రముఖ బ్యాంకులు ఎస్బిఐ, హెచ్.డి.ఎఫ్.సి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీఎం సూర్య ఘర్ యోజన రుణాలను అందిస్తున్నాయి.
అంతేకాదు ఈ పీఎం సూర్యఘర్ యోజన కింద ఉత్పత్తి అయిన కరెంటును మీరు వాడుకోవడం మాత్రమే కాదు విద్యుత్ సంస్థలకు విక్రయించే డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. సాధారణంగా ఒక కిలో వాట్ సోలార్ ప్యానల్ పై 120 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అంటే దాదాపు 1000 రూపాయల బిల్లు వస్తుంది. మీరు సోలార్ ప్యానల్ ద్వారా ఉత్పత్తి అయిన కరెంటును మీటర్ ద్వారా విక్రయించవచ్చు పంపిణీ సంస్థలు కొనుగోలు చేస్తాయి
ఉచిత విద్యుత్ కోసం ఇలా అప్లై చేసుకోండి:
- పీఎం సూర్య ఘర్ పోర్టల్ ద్వారా మీరు నమోదు చేసుకోవచ్చు మీ రాష్ట్రం విద్యుత్ సరఫరాల సంస్థను ఎంచుకొని విద్యుత్ కనెక్షన్ నెంబరు ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి ద్వారా ఈ పోర్టల్ లో వివరాలు తెలపాల్సి ఉంటుంది
- ఇప్పుడు రూఫ్ టాప్ సోలార్ కోసం అప్లై చేసుకొని ఫారం ను పూర్తించాల్సి ఉంటుంది. అంతే కాదు నెట్ మీటర్ గురించి కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, డిస్కం అధికారులు నెట్ మీటర్ను అమర్చి తనిఖీ చేస్తారు. ఆ తర్వాత మీకు సర్టిఫికెట్ జారీ చేస్తారు తద్వారా మీకు 30 రోజుల్లో సబ్సిడీ లభిస్తుంది.
లోన్ ఇలా లభిస్తుంది:
సూర్య ఘర్ యోజన కింద, రెండు రకాల సోలార్ ప్యానెల్ కనెక్షన్‌లను ఇన్‌స్టాల్ చేయడంపై మీకు లోన్ ఇచ్చే నిబంధన ఉంది. ఇందులో, మీకు ఒకటి 3 కిలో వాట్, మరొకటి 10 కిలో వాట్ సోలార్ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి రుణం అందుబాటులో ఉంది.. ఇందులో మీరు 3kW సోలార్ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేస్తుంటే. కాబట్టి మీకు రూ.2 లక్షల వరకు రుణం ఇస్తారు. ఇందులో 10% ఖర్చులను మీరే భరించాలి. అయితే 10కిలోవాట్ల సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తే రూ.6 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఇందులో 20% మీరే చెల్లించాలి. కాబట్టి రుణం 80% పొందవచ్చు.