PM Svanidhi Yojana Scheme: నిరుపేద వర్గాలను ఆర్థికంగా పరిపుష్టిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ పథకాల్లో ప్రధానమంత్రి స్వనిధి యోజన పథకం కూడా ఒకటి. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుండి రూ. 50,000 వరకు ఆర్థిక సహాయాన్ని రుణంగా పొందడానికి అవకాశం ఉంటుంది. లబ్ధిదారులు తీసుకున్న రుణాన్ని తిరిగి సకాలంలో ఒక స్వీయ క్రమశిక్షణతో తిరిగి చెల్లించడం ద్వారా వారు మరోసారి అంతకంటే ఎక్కువ మొత్తంలో రుణం పొందేందుకు మార్గం సుగుమమవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పీఎం స్వనిధి యోజన పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి గడువు..
ప్రస్తుతం కేంద్రం విధించుకున్న నిబంధనల ప్రకారం.. పీఎం స్వనిధి యోజన పథకం డిసెంబర్ 2024 వరకు అమలులో ఉంటుంది. మొదటిసారి రూ. 10,000 లేదా రెండోసారి రూ. 20,000 విలువైన రుణాలు అందించే ప్రభుత్వం మూడోసారి రూ. 50,000 వరకు కూడా లోన్ అందించే అవకాశం ఉంది.


పీం స్వనిధి పథకం ప్రయోజనాలు
లబ్ధిదారులు తీసుకున్న రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే... వారు 7 శాతం వరకు సబ్సిడీని పొందే అవకాశం కూడా ఉండటం గొప్ప విషయం. సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా ప్రభుత్వానికి మీపై విశ్వాసం ఏర్పడుతుంది. తద్వారా మీరు ప్రభుత్వం నుండి మరిన్ని రుణాలు పొందే అవకాశం ఉంటుంది. అలా మరోసారి మీ లోన్ మొత్తాన్ని రెండింతలు పొందడానికి అవకాశం కలుగుతుంది.


ప్రధాన మంత్రి స్వనిధి యోజన పథకం కింద రుణం తీసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్స్


  1. ఆధార్ కార్డ్

  2. ఓటరు ఐడి కార్డు

  3. రేషన్ కార్డు

  4. బ్యాంక్ పాస్‌బుక్ ఫోటోకాపీ

  5. పాస్‌పోర్ట్ సైజు ఫోటో


రుణం కోసం దరఖాస్తు చేయడానికి ఏం చేయాలంటే..
పీఎం స్వనిధి అధికారిక వెబ్‌సైట్ www.pmsvanidhi.mohua.gov.in ని విజిట్ చేయండి. హోమ్ పేజీలో ఉన్న లోన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.


ఇది కూాడా చదవండి : Best Selling Hatchbacks: ఎక్కువగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే


ఇది కూాడా చదవండి : Small Savings Schemes: బ్యాంకులు ఇచ్చే వడ్డీ కంటే ఈ వడ్డీ రేట్లే ఎక్కువ


ఇది కూాడా చదవండి : Photo Change On Aadhaar Card: ఆధార్ కార్డుపై ఫోటో మార్చుకోవడం ఎలా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook