Post Office Superhit Scheme: మీ డబ్బును రెట్టింపు చేసే పోస్టాఫీసు సూపర్‌హిట్ స్కీమ్ ఇదే, 5 లక్షలకు 10 లక్షలు
Post Office Superhit Scheme: అధిక లాభాలు ఇచ్చే ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ చాలానే ఉన్నాయి. కానీ చాలా పధకాల్లో రిస్క్ ఉంటుంది. కానీ పోస్టాఫీసు పధకాల్లో అధిక లాభాలే తప్ప రిస్క్ ఏ మాత్రం ఉండదు. అందుకే రిస్క్ లేని ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ కావాలంటే పోస్టాఫీసు పధకాలు బెస్ట్ ఆప్షన్.
Post Office Superhit Scheme: ఇటీవలి కాలంలో పోస్టాఫీసులకు ఆదరణ పెరుగుతోంది. వివిధ రకాల ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్‌ను కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసుల ద్వారా అందిస్తుండటమే ఇందుకు కారణం. ఇందులో పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ ఒకటి. ఇందులో మీరు పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవుతుంది. రిస్క్ ఏ మాత్రం ఉండదు. అదెలాగో తెలుసుకుందాం.
పోస్టాఫీసుల్లో ఇప్పటికే చాలా రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. రిస్క్ లేని పెట్టుబడి కోసం చూస్తుంటే మాత్రం ఇవే మంచి ఆప్షన్. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ పధకం ఒకటి. పోస్టాఫీసు ఎఫ్‌డి అని కూడా పిలుస్తుంటారు. ఈ స్కీమ్‌లో మీరు పెట్టిన పెట్టుబడి నిర్ణీత సమయం తరువాత రెట్టింపు అవుతుంది. అంటే ఇందులో మీరు 5 లక్షలు పెట్టుబడి పెడితే నిర్ణీత కాలవ్యవధి తరువాత 10 లక్షలవుతుంది.
పోస్టాఫీసు ఎఫ్‌డి అనేది 1,2,3 లేదా 5 ఏళ్లకు ఉంటుంది. కాలవ్యవధిని బట్టి వడ్డీ వేర్వేరుగా ఉంటుంది. రెట్టింపు డబ్బులు పొందాలంటే 5 ఏళ్ల ఎఫ్‌డి ఎంచుకోవల్సి ఉంటుంది. ఈ ఎఫ్‌డీ పై ప్రస్తుతం 7.5 శాతం వడ్డీ లభిస్తోంది. మీరు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ రెట్టింపు చేయాలంటే ఇదే మంచి పద్ధతి. ఈ ఎఫ్‌డిపై ఇన్‌కంటాక్స్ సెక్షన్ 80 సి ప్రకారం ట్యాక్స్ మినహాయింపు వర్తిస్తుంది.
5 లక్షల రూపాయలు పోస్టాఫీసు ఎఫ్‌డిలో 5 ఏళ్లకు ఇన్వెస్ట్ చేస్తే 7.5 శాతం వడ్డీ చొప్పున 5 ఏళ్లలో మీ డబ్బులపై 2,24,974 రూపాయలు వడ్డీ అందుతాయి. అంటే మొత్తం మీ డబ్బులు 7,24,974 రూపాయలవుతుంది. ఆ తరువాత మరో ఐదేళ్లకు పొడిగిస్తే 5,51,175 రూపాయలు కేవలం వడ్డీ లభిస్తుంది. అంటే పదేళ్ల తరువాత మొత్తం మీకు 10 లక్షల 51 వేల 175 రూపాయలు చేతికి అందుతాయి.
పోస్టాఫీసు 1 ఏడాది ఎఫ్‌డిని మెచ్యూరిటీ కంటే 6 నెలల్లోపు పొడిగించవచ్చు. 2 ఏళ్ల ఎఫ్‌డీని అయితే 12 నెలల్లోపు 3 లేదా 5 ఏళ్ల ఎఫ్‌డీని 18 నెలల్లోపు పొడిగించవచ్చు.
Also read: No Fastags: ఫాస్టాగ్‌కు చెల్లుచీటీ, ఇకపై నో టోల్‌ప్లాజా, త్వరలో కొత్త విధానం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook