Gram Suraksha Yojana Scheme Details in Telugu: ప్రస్తుతం పోస్టాఫీసు ద్వారా అనేక రకాల సేవింగ్ స్కీమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఇన్వెస్ట్‌ చేస్తే ఎలాంటి రిస్క్ లేకుండా మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడి పెట్టి కోట్లాది మంది మంచి ఆదాయం పొందుతున్నారు. మీరు కూడా ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్లాన్ చేస్తున్నట్లయితే.. మీకు బంపర్ ఆఫర్ ఉంది. ప్రతి రోజూ 50 రూపాయలు పొదుపు చేస్తే.. చేతికి రూ.35 లక్షలు పొందొచ్చు. ఈ స్కీమ్‌ పేరు గ్రామ సురక్ష యోజన. ఈ స్కీమ్ గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ప్రోగ్రామ్‌లో భాగం. ఈ బీమా పాలసీ దేశంలోని గ్రామీణ ప్రజల కోసం 1995 సంవత్సరంలో ప్రారంభించారు. 19 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న వారు గ్రామ సురక్ష యోజనలో పెట్టుబడి పెట్టవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Telangna Congress: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. దానం, కడియంలకు కాంగ్రెస్ బిగ్ షాక్..


ఈ పథకంలో రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెలవారీగా లేదా త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షిక ప్రాతిపదికన ప్రీమియం చెల్లించవచ్చు. ఈ స్కీమ్‌లో ప్రతి నెల రూ.1,515 అంటే కేవలం రోజుకు రూ.50 పెట్టుబడి పెడితే.. రూ.35 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు. ఉదాహరణకు మీరు 19 ఏళ్ల వయస్సులో గ్రామ సురక్ష పథకంలో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే.. మీకు 55 సంవత్సరాలు వచ్చే వరకు రూ.1,515 ప్రీమియం చెల్లించాలి. అదే 58 సంవత్సరాల వయస్సు వరకు ఈ పథకాన్ని తీసుకుంటే.. ప్రతి నెలా రూ. 1463 చెల్లించాలి. 60 ఏళ్లకు తీసుకుంటే.. ప్రతి నెలా రూ.1411 చెల్లించాల్సి ఉంటుంది.


మీరు ప్రీమియం చెల్లించడం మిస్ అయితే.. 30 రోజుల్లోగా డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో 55 ఏళ్ల ఇన్వెస్ట్‌మెంట్‌పై రూ.31.60 లక్షలు, 58 ఏళ్ల పెట్టుబడిపై రూ.33.40 లక్షలు, 60 ఏళ్ల పెట్టుబడిపై రూ.34.60 లక్షల మెచ్యూరిటీ ప్రయోజనం పొందొచ్చు. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తికి 80 ఏళ్లు నిండిన తర్వాత ఈ మొత్తాన్ని అందజేస్తారు. ఒక వేళ వ్యక్తి మరణించినట్లయితే.. ఈ మొత్తం ఆ వ్యక్తి చట్టపరమైన వారసునికి చెందుతుంది. గ్రామ సురక్ష పథకంలో ఇన్వెస్ట్ చేసిన తరువాత వద్దనుకుంటే.. 3 సంవత్సరాల తర్వాత దానిని సరెండర్ చేయవచ్చు. అయితే అప్పుడు ఆ స్కీమ్‌లో ఉన్న ప్రయోజనాలు లభించవు. ఈ స్కీమ్‌లో అందరికీ నచ్చే విషయం ఏంటంటే.. ఇండియా పోస్ట్ అందించే బోనస్. ఈ స్కీమ్‌లో చివరగా ప్రతి రూ.1,000కి సంవత్సరానికి 60 రూపాయల బోనస్‌ను ప్రకటించింది. అంటే మీరు మీరు పెట్టే ఇన్వెస్ట్‌మెంట్‌పై బోనస్ అమౌంట్ అదనంగా యాడ్ అవుతుంది.


Also Read: ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ‌విజయ్ దేవరకొండ కెరియర్ లోనే అత్యంత తక్కువ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook