Post Office Scheme: పోస్ట్ ఆఫీసులో అద్భుతమైన స్కీమ్ ప్రారంభమైంది. మీ పిల్లల వయస్సు పదేళ్ల కంటే ఎక్కువైతే..ఎక్కౌంట్ ఓపెన్ చేయండి..నెలకు 2500 తీసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పిల్లల కోసం సేవింగ్స్ చేసే ఆలోచన ఉంటే పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్ అందుబాటులో ఉంది. పోస్టాఫీసు పథకాలు సురక్షితమైనవే కాకుండా నిశ్చితంగా లాభాల్ని తెచ్చిపెట్టేవి. ఇందులో ఒకటి ఎంఐఎస్. అంటే మంత్లీ ఇన్‌కం స్కీమ్. ఇదొక సేవింగ్ పథకం. ఒకసారి డబ్బులు పెడితే ప్రతి నెలా ఇంట్రెస్ట్ రూపంలో లబ్ది పొందవచ్చు. ఆ వివరాలు మీ కోసం..


పదేళ్ల కంటే ఎక్కువ వయస్సున్న పిల్లల పేరుపై ఈ ఎక్కౌంట్ ఓపెన్ చేయవచ్చు. మీ ఇంటికి సమీపంలో ఏదో ఒక పోస్టాఫీసులో ఈ ఎక్కౌంట్ ఓపెన్ చేయవచ్చు. కనీసం 1000 రూపాయలు అత్యధికంగా 4.5 లక్షల రూపాయలు ఇందులో జమ చేయవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌లో వడ్డీ 6.6 శాతం ఇస్తున్నారు. మీ పిల్లల వయస్సు పదేళ్ల కంటే తక్కువుంటే..తల్లిదండ్రుల పేరుతో ఓపెన్ చేయవచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ ఐదేళ్లు.


మీ పిల్లోడి వయస్సు పదేళ్లైతే..ఎక్కౌంట్ ఓపెన్ చేసి 2 లక్షలు జమ చేశారనుకుందాం. వడ్డీ 6.6 శాతం చొప్పున ప్రతి నెలా 1100 రూపాయలు లభిస్తాయి. ఐదేళ్లలో ఈ వడ్డీ మొత్తం 66 వేలుగా మారుతుంది. అదే ప్రారంభంలోల 4.5 లక్షలు జమ చేస్తే నెలకు 2500 తీసుకోవచ్చు. 3.5 లక్షల జమ చేస్తే నెలకు 1925 రూపాయలు తీసుకోవచ్చు.


Also read: Flipkart Sales: సెప్టెంబర్ 23 నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం, 1 రూపాయి టోకెన్ అడ్వాన్స్‌తో ప్రీ బుకింగ్ సౌకర్యం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook