Deposit Rs 12500 per month and get Rs 1 crore : ప్రస్తుత కాలంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించే మార్గాలు ఎన్నో ఉన్నాయి. గత కొన్ని రోజులుగా స్టాక్‌ మార్కెట్‌లలో ఆశాజనక ప్రయోజనాలు లేకపోవడంతో.. పెట్టుబడి పెట్టడానికి చాలామంది మొగ్గు చూపడం లేదు. స్టాక్‌ మార్కెట్‌లలో పెట్టుబడి పెట్టి  ఆందోళన పడాల్సిన అవసరం లేకుండా.. స్థిరమైన రాబడిని పొందాలనుకునే వారికి ఓ ప్రభుత్వ పొదుపు పథకం అందుబాటులో ఉంది. భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రావిడెంట్‌ ఫండ్‌ పథకం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7.1 శాతం వార్షిక వడ్డీ:
తక్కువ పెట్టుబడితో అధిక రాబడి పొందాలనుకునే వారికి పోస్టాఫీసు పథకం పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్) రూపంలో ఓ మంచి అవకాశం ఉంది. ఇందులో నెలకు రూ.12,500 పెట్టుబడి పెడితే.. మెచ్యూరిటీ సమయానికి ఒక కోటి మీరు పొందవచ్చు.  ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టినా.. ఎక్కువ మందిని ఆకట్టుకున్నది మాత్రం ఈ పథకం మాత్రమే. ఎందుకంటే పెట్టుబడి సురక్షితం, మంచి వడ్డీరేటు లభిస్తుంది. ప్రస్తుతం పోస్టాఫీసులో పీపీఎఫ్ పథకంపై 7.1 శాతం వార్షిక వడ్డీ వస్తుంది.


కనీస పెట్టుబడి రూ.500
మీరు పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ బ్రాంచ్‌లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను తెరవవచ్చు. నెలకు రూ.500 కనీస మొత్తంతో పీపీఎఫ్‌ను ఆరంభించొచ్చు. ఇందులో ఏటా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ ఖాతా మెచ్యూరిటీ వ్యవధి 15 సంవత్సరాలు. గరిష్ఠంగా నెలకు రూ.12,500 లేదా ఏడాదికి రూ.1.50 పెట్టుబడి పెట్టొచ్చు.  పీపీఎఫ్‌ మెచ్యూరిటీ సమయం 15 ఏళ్లు కాగా.. ఐదేళ్ల పాటు రెండుసార్లు పొడగించుకోవచ్చు.


రూ.12,500 డిపాజిట్ చేస్తే:
మీరు ప్రతి నెలా పీపీఎఫ్ ఖాతాలో రూ.12,500 డిపాజిట్ చేసి 15 ఏళ్ల పాటు మెయింటెయిన్ చేస్తే.. మెచ్యూరిటీపై మొత్తం రూ.40.68 లక్షలు అందుతాయి. ఇందులో మీ మొత్తం పెట్టుబడి రూ. 22.50 లక్షలు కాగా.. మీ వడ్డీ ఆదాయం రూ. 18.18 లక్షలు. అదే సమయంలో ఈ పథకంను ఐదేళ్ల పాటు రెండుసార్లు కొనసాగిస్తే.. 25 ఏళ్ల తర్వాత మీరు రూ. 1.03 కోట్లు సొంతం చేసుకోవచ్చు. 25 సంవత్సరాలలో మీ మొత్తం పెట్టుబడి రూ. 37.50 లక్షలు కాగా.. వడ్డీ ఆదాయంగా రూ. 65.58 లక్షలు పొందుతారు.


ఆదాయపన్ను మినహాయింపు:
ఈ పథకం ఆదాయపన్ను మినహాయింపు కిందకు వస్తుంది. సెక్షన్‌ 80సీ ప్రకారం పన్ను మినహాయింపు పొందొచ్చు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఈ ఖాతా తెరవొచ్చు. పిల్లల పేరుతో పెద్దలూ తెరవొచ్చు. ప్రభుత్వ రంగ బ్యాంకులు లేదా పోస్టాఫీసులో పీపీఎఫ్‌ను సులభంగా కట్టుకోవచ్చు. ఈ పథకం పూర్తి సురక్షితం కూడా. 


Also Read: Dollar Vs Rupee: డాలర్‌తో రూపాయి పోటీ పడలేకపోతోందా..మనకు లాభామా..నష్టమా..!


Also Read: దీపక్‌ హుడా అరుదైన రికార్డు.. నాలుగో ప్లేయర్‌గా..! కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.