Post office RD Benefits: కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసు పధకాలపై ఎప్పటికప్పుడు వడ్డీ రేట్లు సమీక్షిస్తుంటుంది. ఉద్యోగులకు పోస్టాఫీసు పధకాలు బెస్ట్ అని చెప్పవచ్చు. జీరో రిస్క్‌తో అత్యధిక రిటర్న్స్ లభిస్తాయి. అలాంటి పథకాల గురించి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోస్టాఫసు పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు డబ్బుల్లేకపోయినా ఫరవాలేదు. ఒకేసారి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెలకు కొంతమొత్తం ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. నెలకు కొంత డబ్బు పోస్టాఫీసు పధకంలో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో ఒకేసారి పెద్దమొత్తంలో నగదు అందుకోవచ్చు. దీనినే పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అంటారు. ఈ పధకంపై కేంద్ర ప్రభుత్వం 6.7 శాతం వడ్డీ అందిస్తోంది. పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకంలో నెలకు 5 వేల రూపాయలు ఇన్వెస్ట్ చేయవచ్చు. 5 ఏళ్లలో 4 లక్షల 20 వేల రూపాయలు సంపాదించగలరు. రికరింగ్ డిపాజిట్ పధకంలో వడ్డీ రూపంలో 79,564 రూపాయలు లభిస్తాయి. అంటే 5 ఏళ్లలో మొత్తం 4,99, 564 రూపాయలు కూడబెట్టవచ్చు.


అదే నెలకు 5 వేల రూపాయలు ఇన్వెస్ట్ చేయగలిగితే ఏడాదికి 60 వేలవుతుంది. ఐదేళ్లకు 3 లక్షల రూపాయలు అవుతుంది. దీనిపై వడ్డీ 56,830 రూపాయలుంటుంది. ఇది 5 ఏళ్లకు 6.7 శాతం చొప్పున వడ్డీ రూపంలో లభించే మొత్తం. అంటే మొత్తం 5 ఏళ్లకు 3 లక్షల 56 వేల 830 రూపాయలు అందుతాయి. నెలకు 5 వేల రూపాయలు చెల్లించగలిగే పరిస్థితి లేకుంటే నెలకు 3 వేలు కూడా జమ చేయవచ్చు. ఇలా చేస్తే ఏడాదికి 36 వేలవుతుంది. 5 ఏళ్లకు మీరు పెట్టే పెట్టుబడి 1 లక్షా 80 వేలు. పోస్టాఫీసు ఆర్డీ ప్రకారం వడ్డీ రూపంలో 34,097 రూపాయలు లభిస్తాయి. అంటే నెలకు 3 వేల రూపాయలు పెట్టుబడి పెడితే 5 ఏళ్లకు 2 లక్షల 14 వేల 97 రూపాయలు లభిస్తాయి.


రికరింగ్ డిపాజిట్ పధకంపై లభించే వడ్డీపై టీడీఎస్ కట్ అవుతుంది. టీడీఎస్ అనేది రికరింగ్ డిపాజిట్‌పై లభించే వడ్డీపై 10 శాతం ఉంటుంది. రికరింగ్ డిపాజిట్‌పై లభించే వడ్డీ 10 వేలుంటే టీడీఎస్ కట్ అవుతుంది. 


Also read: Bhole Baba: తొక్కిసలాట ఘటనపై బోలే బాబా సంచలన ప్రకటన.. ఏమన్నారంటే?



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook