Post Office Savings Account vs SBI Savings Account: పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ vs SBI సేవింగ్స్ అకౌంట్.. రెండింటిలో ఏది ఎక్కువ వడ్డీ చెల్లిస్తుంది..?
Post Office vs SBI Savings Account: ప్రైవేట్ బ్యాంకులతోపాటు పోస్టు ఆఫీసులు కూడా బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నాయి. వీటిలో పోస్టు ఆఫీస్ సేవింగ్ స్ అకౌంట్ మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ vs SBI సేవింగ్స్ అకౌంట్..ఈ రెండింటిలో ఏది ఎక్కువ వడ్డీ చెల్లింస్తుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Post Office Savings Account vs SBI Savings Account: సాధారణంగా మనం బ్యాంకులో ఒక ఎకౌంటు ఓపెన్ చేయాలంటే సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తాము. ఈ సేవింగ్స్ అకౌంట్ లో దాచుకున్న డబ్బుపై బ్యాంకులు వడ్డీని చెల్లిస్తాయి. అయితే ఒక్కో బ్యాంకు ఒక్కో వడ్డీ రేటును కలిగి ఉంటుంది. అయితే ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు తో పాటు పోస్ట్ ఆఫీసులు కూడా బ్యాంకింగ్ సేవలను అందిస్తుంటాయి. వీటిలో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థ లేని గ్రామీణ ప్రాంత ప్రజలకు పోస్ట్ ఆఫీస్ సేవలు అనేక రకాలుగా ఉపయోగపడతాయి. పోస్టాఫీసులో కనీస డిపాజిట్ మొత్తం రూ. 500 కాగా, కనీస ఉపసంహరణ మొత్తం రూ. 50 మాత్రమే. గరిష్ట పెట్టుబడికి లిమిట్ మొత్తం లేదు. అలాగే పోస్టాఫీసులో డిపాజిట్లపై రూ. 10,000 వరకు పన్ను మినహాయింపు కూడా అందుబాటులో ఉంది. పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్ల విషయానికి వస్తే, పోస్టాఫీసులో పొదుపుపై అకౌంట్ లపై అత్యధికంగా 4 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. ఇది ఇతర బ్యాంకులతో పోల్చితే అత్యధికం అని చెప్పవచ్చు. ఇతర బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్ లపై ఎంత వడ్డీ చెల్లిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
SBI సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు:
రూ. 10 కోట్ల వరకు ఉన్న బ్యాలెన్స్ మొత్తానికి వడ్డీ రేటు 2.70శాతం గా నిర్ణయించారు, రూ. 10 కోట్ల కంటే ఎక్కువ ఉన్న మొత్తానికి 3శాతం వడ్డీ చెల్లిస్తారు.
Also Read: SBI loan Interest Rates: SBI కస్టమర్లకు షాకింగ్ న్యూస్..లోన్ తీసుకున్న వారికి EMI భారం మరింత పెరిగే చాన్స్..!
HDFC బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు:
HDFC బ్యాంక్‌లోని సేవింగ్స్ అకౌంట్ లపై వడ్డీ రేటు రూ. 50 లక్షల కంటే తక్కువ ఉన్న బ్యాలెన్స్ మొత్తానికి 3% , రూ. 50 లక్షల కంటే ఎక్కువ బ్యాలెన్స్ మొత్తానికి 3.50% చెల్లిస్తారు.
ICICI బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు:
రూ. 50 లక్షల కంటే తక్కువ బ్యాలెన్స్ మొత్తంపై, వడ్డీ రేటు 3% చెల్లిస్తారు. రూ. 50 లక్షల కంటే ఎక్కువ బ్యాలెన్స్ మొత్తంపై 3.5% వడ్డీని అందిస్తుంది.
PNB సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు:
పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ. 10 లక్షల కంటే తక్కువ మొత్తంపై 2.70% వడ్డీని చెల్లిస్తుంది, రూ. 10 లక్షల నుండి రూ. 100 కోట్ల కంటే తక్కువ మొత్తంపై 2.75% వడ్డీని అందిస్తుంది. రూ. 100 కోట్లు , అంతకంటే ఎక్కువ మొత్తంపై 3% వడ్డీని అందిస్తుంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు:
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 50 లక్షల వరకు బ్యాలెన్స్ అమౌంట్‌పై 2.75% వడ్డీని , రూ. 50 లక్షల కంటే ఎక్కువ బ్యాలెన్స్ మొత్తంపై 2.90% వడ్డీని అందిస్తుంది. బ్యాంక్ రూ. 100 కోట్ల కంటే ఎక్కువ బ్యాలెన్స్ మొత్తంపై 3.10% వడ్డీ రేటును, రూ. 500 కోట్ల కంటే ఎక్కువ బ్యాలెన్స్ మొత్తంపై 3.40% వడ్డీ రేటును అందిస్తుంది.
IDFC ఫస్ట్ బ్యాంక్ పొదుపు అకౌంట్ :
ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ రూ.1 లక్షలోపు బ్యాలెన్స్‌పై 3% వడ్డీని, రూ. 1 లక్ష లోపు బ్యాలెన్స్‌పై 3.50% వడ్డీని , రూ. 3 లక్షల కంటే తక్కువ మొత్తాన్ని అందిస్తుంది. బ్యాంకు రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల మధ్య బ్యాలెన్స్‌పై 4% వడ్డీని అందిస్తుంది. రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షలు , రూ. 5 కోట్ల నుండి రూ. 50 కోట్ల మధ్య బ్యాలెన్స్‌పై 7% వడ్డీని అందిస్తుంది.
Also Read:Amrit Vrishti: SBI నుంచి బంపర్ స్కీం.. 5 లక్షల డిపాజిట్‌పై ఎంత రాబడి వస్తుందంటే.!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి