Post Office Scheme: పోస్టాఫీసు ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే రెట్టింపు ఆదాయం.. పూర్తి వివరాలు ఇవిగో..
Post Office Double Money Scheme: మీరు సురక్షితంగా పెట్టుబడి కోసం చూస్తున్నారా..? తక్కువ వ్యవధిలోనే మీరు రెట్టింపు ఆదాయం కోసం చూస్తున్నారా..? అయితే మీకోసం పోస్టాఫీసు కిసాన్ వికాస్ పత్ర పథకంలో పథకాన్ని తీసుకువచ్చింది. ఇందులో పెట్టుబడి పెడితే 120 నెలల్లోనే రెట్టింపు ఆదాయం వస్తుంది.
Post Office Double Money Scheme: ప్రజల కోసం పోస్ట్ ఆఫీస్ మరో సూపర్ స్కీమ్ తీసుకువచ్చింది. ఈ పథకంలో పెట్టుబడి పెడితే మీ డబ్బు కేవలం కొద్ది నెలల్లోనే రెట్టింపు అవుతుంది. మీరు ప్రభుత్వ పథకం ద్వారా మీ డబ్బును రెట్టింపు చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఇది మీకు గొప్ప అవకాశం. కొత్త సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పథకం వడ్డీ రేట్లను పెంచిన నేపథ్యంలో పెట్టుబడి పెడితే మీ డబ్బు రెట్టింపు అవుతుంది.
మీరు కిసాన్ వికాస్ పత్ర పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా డబ్బును రెట్టింపు చేసుకోవచ్చు. కేవీపీపై వడ్డీ రేట్లను ప్రభుత్వం 20 బేసిస్ పాయింట్లు పెంచింది. కొత్త రేట్లు జనవరి 1, 2023 నుంచి అమలులోకి వచ్చాయి. వడ్డీ రేట్లు పెరిగిన తర్వాత 123 నెలలకు బదులుగా.. మీ 5 లక్షలు కేవలం 120 నెలల్లో 10 లక్షలుగా మారతాయి.
ఇప్పుడు ఎంత వడ్డీ వస్తోంది..?
కిసాన్ వికాస్ పత్ర పథకంలో 7.20 శాతం వడ్డీ ప్రయోజనం లభిస్తుంది. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే మీరు కేవలం 1000 రూపాయలతో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. ప్రస్తుతం ఈ పథకంలో గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. మీరు ఈ పథకంలో ఒకే ఖాతాను తెరవవచ్చు. అంతేకాకుండా ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేయవచ్చు. మీరు నామినీ సౌకర్యం ఉన్న వారు కూడా ప్రయోజనాన్ని పొందుతారు. ఈ ప్రభుత్వ పథకంలో రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే.. 120 నెలల తర్వాత మీరు రూ.10 లక్షలు పొందుతారు. పోస్టాఫీసు పథకంలో డబ్బు హామీతో భారీ లాభాలు కూడా ఉంటాయి.
Also Read: Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోకి సమ్మె ఎఫెక్ట్.. స్తంభించిన టికెట్ వ్యవస్థ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి