Post Office Scheme: పోస్టాఫీసు పథకాలు ఎప్పుడూ సురక్షితమే కాకుండా లాభాలు ఎక్కువ. పోస్టాఫీసు పధకాల్లో పెట్టుబడితో లక్షలు సంపాదించవచ్చు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోస్టాఫీసు కస్టమర్ల కోసం అద్భుతమైన పథకాల్ని ప్రవేశపెడుతోంది. ఈ పథకాలు సురక్షితమే కాకుండా ఎక్కువ రిటర్న్స్ అందిస్తాయి. పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పధకం కస్టమర్లకు మంచి రిటర్న్స్ అందిస్తుంది. మ్యూచ్యువల్ ఫండ్స్ కూడా లాభాల్ని ఇస్తున్నా..రిస్క్ ఉంటుంది. పోస్టాఫీసు పథకాల్లో మాత్రం రిస్క్ అనేది ఉండదు. 


పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకం అనేది ఒక స్మాల్ సేవింగ్ స్కీమ్. ఇందులో ఎంత వీలైతే అంత డిపాజిట్ చేసుకోవచ్చు. ఇందులో 1, 2 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం కోసం కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో ప్రతి మూడు నెలలకు వడ్డీ లభిస్తుంది.


ఈ పథకంలో వడ్డీ అనేది 5.8 శాతంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సేవింగ్ పథకాలపై వడ్డీని ప్రతి మూడు నెలలకోసారి జమ చేస్తుంది. ఈ పధకంలో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయడం ద్వారా లక్షలాది రూపాయలు సంపాదించవచ్చు. ఈ పథకం ద్వారా రుణ సదుపాయం కూడా ఉంటుంది. ఈ పథకంలో 12 వాయిదాలు జమ చేస్తే..బ్యాంకుల్నించి రుణం తీసుకోవచ్చు. ఈ ఎక్కౌంట్‌లో జమ చేసిన మొత్తంలో 50 శాతం రుణం తీసుకోవచ్చు.


పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పధకంలో ఒకవేళ మీరు నెలకు 10 వేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే..10 ఏళ్ల అనంతరం మీకు 16 లక్షల కంటే ఎక్కువే చేతికి అందుతాయి. 10 ఏళ్లలో మీరు జమ చేసేది 12 లక్షలు మాత్రమే. ఈ పధకం వ్యవధి పూర్తయిన తరువాత 4 లక్షల 26 వేల 476 రూపాయలు అదనంగా లభిస్తాయి. ఈ విధంగా మీకు 10 ఏళ్ల తరువాత 16 లక్షల 26 వేల 476 రూపాయలు లభిస్తాయి.


Also read: SBI Loans: మహిళలకు ఎస్బీఐ నుంచి 25 లక్షల వడ్డీ రహిత రుణాలు, వైరల్ అవుతున్న మెస్సేజ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook