Post Office: పోస్టాఫీసు పథకంలో రోజుకు 50 రూపాయలతో..35 లక్షలు పొందండి
Post Office: పోస్టాఫీసు పథకాలకు ఇటీవల కొద్దికాలంగా ఆదరణ పెరుగుతోంది. రిస్క్ లేకపోవడమే కాకుండా రిటర్న్స్ గ్యారంటీ ఉండటం దీనికి కారణం. అలాంటిదే ఈ పోస్టాఫీసు పథకం.
పోస్టాఫీసు పథకాలు ఈ మధ్యకాలంలో ఇతర ఇన్వెస్ట్‌మెంట్ పథకాలతో పోటీ పడుతున్నాయి. పోస్టాఫీసులో గ్రామ సురక్ష యోజన పథకం అందర్నీ అమితంగా ఆకర్షిస్తోంది. కేవలం 50 రూపాయలు జమ చేయడం ద్వారా..లక్షాధికారి కావచ్చు ఈ పధకంతో.
పోస్టాఫీసు పధకాల్లో అత్యంత ఆదరణ లభిస్తున్న పధకం గ్రామ సురక్ష యోజన. ఈ పథకంలో ప్రతిరోజూ 50 రూపాయలు జమ చేస్తే..భవిష్యత్తులో 35 లక్షల రూపాయలు సంపాదించగలరు. పోస్టాఫీసుల్లో పెట్టుబడిని అత్యంత సురక్షితంగా భావిస్తారు. వాస్తవానికి ఏ ఇన్వెస్ట్‌మెంట్‌లో అయినా రిస్క్ తప్పకుండా ఉంటుంది. కానీ పోస్టాఫీసు పథకాల్లో రిస్క్ ఉండదు. కారణం ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. అదే సమయంలో లాభాలు కూడా ఉంటాయి.
35 లక్షల రిటర్న్స్
పోస్టాఫీసులో చిన్న చిన్న సేవింగ్ పథకాలే మంచి ప్రత్యామ్నాయాలుగా మారుతాయి. ఇందులో రిస్క్ ఫ్యాక్చర్ ఉండదు. రిచర్న్స్ అధికం. అందుకే గ్రామ సురక్ష యోజన ఆదరణ పొందుతోంది. ఇండియా పోస్ట్ అందిస్తున్న ఈ పథకంలో రిటర్న్స్ బాగుంటాయి.ఈ పథకంలో ప్రతి నెలా 1500 రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది. ఇలా పొదుపు చేస్తూ పోతే..రానున్న కాలంలో 31-35 లక్షలకు చేరుకోవచ్చు.
పెట్టుబడి నిబంధనలు
19 నుంచి 55 ఏళ్ల వయస్సు మధ్యలో ఉండి భారతీయుడై ఉండాలి. అప్పుడే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయవచ్చు.
ఈ పథకం ప్రకారం కనీస ఇన్సూరెన్స్ మొత్తం 10 వేల రూపాయల్నించి 19 లక్షల రూపాయలుంది.
ఈ పథకం ప్రీమియం చెల్లింపు నెలవారీ, త్రైమాసిక, అర్ధ సంవత్సర, లేదా వార్షికపరంగా ఉంటుంది.
ప్రీమియం చెల్లించేందుకు 30 రోజులు గడువుంటుంది. ఈ పథకంపై మీరు రుణం కూడా తీసుకోవచ్చు. ఈ పథకాన్ని తీసుకున్న 3 ఏళ్ల తరువాత దీన్ని మీరు సరెండర్ చేయగలరు.
లాభం ఏ మేరకు ఉంటుంది
19 ఏళ్ల వయస్సులో మీరు ఈ పథకంలో చేరి 10 లక్షల రూపాయల పాలసీ తీసుకుంటే..55 ఏళ్లకు నెలవారీ ప్రీమియం 1515 రూపాయలుంటుంది. 58 ఏళ్లకైతే 1463 రూపాయలు కాగా, 60 ఏళ్లకు 1411 రూపాయలుంది. ఈ పరిస్థితుల్లో పాలసీ కొనుగోలుదారుడికి 55 ఏళ్లకైతే 31.60 లక్షలు, 58 ఏళ్లకైతే..33.40 లక్షల రూపాయలు, 60 ఏళ్లకైతే 34.60 లక్షలు లభిస్తాయి.
Also read: Share Market: ఎక్కౌంట్లో ఓ 15 వేలు సిద్ధంగా ఉంచండి చాలు..నాలుగు ఐపీవోలు త్వరలో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook