Sukanya Samriddhi: సుకన్య సమృద్ధి, పీపీఎఫ్ లో డబ్బులు జమ చేస్తున్నారా? అక్టోబర్ 1వ తేదీ నుంచి రూల్స్ ఛేంజ్
Small savings scheme: కేంద్రంలోని మోదీ సర్కార్ ఎన్నో చిన్న మొత్తాల పొదుపు స్కీమ్ లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. పీపీఎఫ్, సుకన్య సమ్రుద్ధి యోజన వంటి స్కీముల్లో చాలా మంది పెట్టుబడి పెడుతున్నారు.అయితే ఈ విషయ మీరు కచ్చితంగా తెలుసుకోవాలి. చిన్న పొదుపు ఖాతాలకు సంబంధించి ఆర్ధిక మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ఇందులో కొత్తగా ఆరు నియమాలను చేర్చారు. నేషనల్ సేవింగ్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్, సుకన్య సమృద్ధి ఖాతా కోసం కొత్త రూల్స్ రానున్నాయి. ఈ రూల్స్ అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి.
Post Office Scheme New Rule: పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్, సుకన్య సమృద్ధి వంటి పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడి పెట్టేవారు కచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. ఈ పథకాలకు సంబంధించిన నిబంధనలలో ప్రభుత్వం మార్పులు చేయనుంది. మీరు కూడా ఈ పథకంలో పెట్టుబడి పెట్టినట్లయితే..కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల గురించి మీరు తెలుసుకోండి. అయితే మారిన ఈ నిబంధనల గురించి తెలుసుకుందాం.
ఈ చిన్న పొదుపు పథకాలను కేంద్ర ప్రభుత్వమే ఆఫర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏదైనా ఖాతా సక్రమంగా లేదని తేలితే..దానిని ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకువచ్చిన నిబంధనలకు అనుగుణంగా అవసరమైన క్రమబద్ధీకరణ కోసం పంపాలని పేర్కొంది. మార్గదర్శకాల ప్రకారం జాతీయ పొదుపు పథకం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) మరియు సుకన్య సమృద్ధి ఖాతా కోసం శాఖ ఆరు కొత్త నిబంధనలను జారీ చేసింది.
Also Read : Janmashtami 2024: జన్మాష్టమి సందర్బంగా హైదరాబాద్ లో దర్శించుకునే శ్రీకృష్ణుడి దేవాలయాలివే
నిబంధనలను ఈ ఆరు వర్గాలుగా విభజించారు:
-అక్రమ జాతీయ పొదుపు పథకం (NSS) ఖాతా
-మైనర్ పేరు మీద పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఖాతా
-బహుళ PPF ఖాతాలు తెరిచినప్పుడు
-NRIలు ప్రారంభించిన PPF ఖాతాలు
-సుకన్య సమృద్ధి ఖాతా పేరెంట్స్ కు బదులుగా గ్రాండ్ పేరెంట్స్ ప్రారంభించిన ఖాతాల రెగ్యులజైషన్ వంటివి ఇందులో ఉన్నాయి.
ఒకటి కంటే ఎక్కువ పీపీఎఫ్ అకౌంట్స్ ఉన్నట్లయితే ముందుగా ప్రారంభించిన అకౌంట్ కొనసాగిస్తారు. తర్వాత ఒపెన్ చేసిన అకౌంట్ ను మొదటి ఖాతాలో విలీనం చేయాలి. రెండుకు మించి అకౌంట్లు ఉన్నట్లయితే వడ్డీ రాదు. వాటిని క్లోజ్ చేయాలి. యాక్టివ్ గా ఉన్న ఎన్ఆర్ఐ పీపీఎఫ్ అకౌంట్స్ సెప్టెంబర్ చివరి వరకు ఉంటాయి. వాటికి వడ్డీ కూడా వస్తుంది. ఆ తర్వాత రాదు. దీనికి పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ 4శాతం ఉంటుంది. సుకన్య, పీపీఎఫ్ మినహాయించి పిల్లల పేరుతో ఓపెన్ చేసిన చిన్న పొదుపు పథకాలు అకౌంట్ మీద సాధరాణ వడ్డీ వస్తుంది.
సుకన్య సమృద్ధి అకౌంట్ ను గార్డియెన్స్ కు బదులుగా తాతమ్మలు తెరిచినట్లయితే అప్పుడు గార్డియన్ షిప్ ట్రాన్స్ ఫర్ చేసుకోవాలి. లేదంటే లీగల్ గార్డియెన్ కు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లేదంటే లీగల్ గార్డియెన్ కు బదిలీ చేస్తారు. ఒకే కుటుంబంలో రెండుకు మించి ఖాతాలు ఉంటే వాటిని క్లోజ్ చేసుకోవాలి. ప్రస్తుతం కేంద్రం సుకన్య సమృద్ధి, సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్, మంత్లీ ఇన్‌కం స్కీమ్, పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర ఇలా ఎన్నో ఉన్నాయి. ఎస్ఎస్ వై స్కీంలో అత్యధికంగా 8.20 శాతం వడ్డీ రేటు అందిస్తుండగా..పీపీఎఫ్ లో 7.10శాతం వడ్డీరేటును ఇస్తుంది.
Also Read : Highest FD Interest Rates: ఈ బ్యాంకులో బంపర్ ఆఫర్.. ఎఫ్డీపై ఏకంగా 9.5 శాతం వడ్డీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.