Post Office Superhit Scheme: పోస్టాఫీసులో ఉండే ఎన్నో పధకాల్లో అద్భుతమైంది కేవలం అమ్మాయిలకు ఉద్దేశించింది ఈ పధకం. సుకన్య సమృద్ధి యోజన పధకం ఇది. ఇది కేవలం ఆడపిల్లలకు వర్తిస్తుంది. మీ అమ్మాయికి పదేళ్లలోపు వయస్సు ఉన్నప్పుడు ఈ స్కీమ్ ఓపెన్ చేసి ఏడాదికి 250 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా 71 లక్షల రూపాయలు అందుకునే అద్భుతమైన పధకమిది. ఎలాగంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా చాలామంది రిస్క్ లేకుండా అత్యధిక రిటర్న్స్ వచ్చే పధకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. స్టాక్ మార్కెట్ రిస్క్ అనుకున్నప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ లేదా ఆర్డీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే ప్రభుత్వ పధకాల్లో పెట్టబడి పెడితే మంచి లాభాలుంటాయి. అలాంటిదే ఈ స్కీమ్. పోస్టాఫీసుల ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్ ఇది. ఈ పధకం కేవలం కుమార్తెల కోసం ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. దేశంలో ఎవరైనా సరే ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అర్హత ఒకటే మీ అమ్మాయి వయస్సు పదేళ్లలోపుండాలి. సుకన్యా సమృద్ధి యోజన స్కీమ్‌లో ఎవరైనా సరే కనీసం ఏడాదికి 250 రూపాయలు గరిష్టంగా 1.5 లక్షల రూపాయలు జమ చేయవచ్చు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని స్కీమ్స్ కంటే ఈ ఒక్క స్కీమ్‌లోనే అత్యధిక వడ్డీ చెల్లిస్తున్నారు. సుకన్యా సమృద్ధి యోజన స్కీమ్‌లో వార్షిక వడ్డీ ఏకంగా 8.2 శాతం ఉంది. ఈ స్కీమ్‌లో కొన్నేళ్లు ఇన్వెస్ట్ చేస్తే మీ అమ్మాయికి 71 లక్షల రూపాయలు లభిస్తాయి. 


ఈ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలో ఎవరైనా సరకే తమ కూతురి పేరిట ఈ ఎక్కౌంట్ ఓపెన్ చేయవచ్చు. దేశంలో ఏ పోస్టాఫీసులోనైనా ఓపెన్ చేసేందుకు వీలుంటుంది. ఈ స్కీమ్ ప్రకారం 15 ఏళ్లు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత మీ అమ్మాయికి 21 ఏళ్లు నిండాక పూర్తి నగదు చేతికి అందుతుంది. ఈ స్కీమ్‌పై ఇచ్చే వడ్డీని ప్రభుత్వం ఏడాదికోసారి చెల్లించినా ప్రతి మూడు నెలలకోసారి సమీక్షిస్తుంటుంది. ప్రతి ఏటా ఏప్రిల్ 5 నాటికి ఇందులో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మీ అమ్మాయికి రోజుల వయస్సు ఉన్నప్పుడు ఈ ఎక్కౌంట్ ఓపెన్ చేస్తే మీ అమ్మాయికి 21 ఏళ్లు నిండేసరికి ఈ పధకం మెచ్యూర్ అవుతుంది.


ఈ స్కీమ్‌లో ఏడాదికి 1.5 లక్షల చొప్పున 15 ఏళ్లు ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే పూర్తి ప్రయోజనాలు లభిస్తాయి. అంటే 15 ఏళ్లకు మీరు చేసే ఇన్వెస్ట్‌మెంట్ 22 లక్షల 50 వేలు. మెచ్యూరిటీ 21 ఏళ్ల తరువాత మీకు అందే డబ్బులు 71 లక్షల 82 వేల 119 రూపాయలు. అంటే 49 లక్షల 32 వేల 119 రూపాయలు వడ్డీ రూపంలో అందుతుంది. 


Also read: SIP Tips: నెలకు 10 వేలతో 10 కోట్లు కూడబెట్టడం ఎలాగో తెలుసా, ఎన్నేళ్లు పడుతుంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.