How to Reduce Electricity Bill: ప్రస్తుతం భారీగా పెరిగిన కరెంట్ ఛార్జీల మోతతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. దీంతో ఇంట్లో, ఆఫీసుల్లో అవసరమైన మేరకే విద్యుత్ వాడుతూ.. కరెంట్ ఛార్జీలు సేవ్ చేసుకోవడంపై అందరూ దృష్టిపెడుతున్నారు. విద్యుత్ ఖర్చులు ఎలా తగ్గించుకోవాలని ప్రత్యామ్నయ మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు. ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, టీవీలు, హీటర్‌లు, వాషింగ్ మెషీన్‌లు, కూలర్‌లు, ACల వాడకం నిత్యం తప్పనిసరి కావడంతో కరెంట్ బిల్లులు ఎక్కువగానే వస్తున్నాయి. మీరు విద్యుత్ ఛార్జీలను తగ్గించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. ఇందుకు కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. ఆ టిప్స్ మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంట్లో సాంప్రదాయ ట్యూబ్ లైట్ల స్థానంలో 2 నుంచి 40 వాట్ల వరకు ఎల్‌ఈడీ బల్బులను ఉపయోగించండి. ఈ బల్బులు విద్యుత్ వినియోగాన్ని తగ్గించడమే కాకుండా మీ మొత్తం కరెంట్ బిల్లు కూడా తక్కువలోనే వస్తుంది. రిఫ్రిజిరేటర్‌ను తగినంత స్టోరేజ్‌లో నార్మల్ మోడ్‌లో పెట్టుకుని యూజ్ చేస్తే పవర్ వినియోగం తక్కువగా ఉంటుంది. నిద్రవేళకు ముందు అనవసరమైన లైట్లను ఆఫ్ చేయాలని గుర్తుంచుకోండి. మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్లినా.. ఒక రూమ్‌లో ఉండి మరో రూమ్‌ ఖాళీగా ఉన్నా లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు ఆఫ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. 


100 నుంచి 140 వాట్‌లతో వినియోగించే పాత ఫ్యాన్‌లను తాజా BLDC ఫ్యాన్‌లుగా మార్చుకోండి. ఇవి కేవలం 40 వాట్స్‌తో పనిచేస్తాయి. లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చిన ఈ ఫ్యాన్లతో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. సోలార్ ప్యానెల్స్‌ను వినియోగించేందుకు మొగ్గు చూపండి. సోలార్ ప్యానెల్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటే.. రోజంతా మీ విద్యుత్ బిల్లును తగ్గించుకోవడంలో సహాయపడటమే కాకుండా ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా పొందొచ్చు. పాత విండో, స్ల్పిట్ ఏసీ ఉంటే వాటి స్థానంలో ఇన్వర్టర్ ఏసీలను తీసుకోండి. ఇవి విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తాయి.


Also Read: Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌


Also Read: వీరూ స్టైల్లో సెంచరీ కొట్టిన యశస్వి జైస్వాల్.. భారీ స్కోర్ దిశ‌గా టీమిండియా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter