Public Provident Fund Details: ప్రస్తుతం ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌) స్కీమ్ ఒకటి. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే.. పెట్టుబడి సేఫ్‌గా ఉండడంతోపాటు దీర్ఘకాలంలో అధిక లాభాలు వచ్చే అవకాశాలు ఉండడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఎస్‌బీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆన్‌లైన్‌లో కూడా అకౌంట్‌ ఓపెన్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. బ్రాంచ్‌కు సందర్శించాల్సిన అవసరం లేకుండా ఇంట్లో కూర్చొనే ఆన్‌లైన్‌లో ఖాతా తెరవచ్చని తెలిపింది. ఎస్‌బీఐలో కాకుండా పోస్టాఫీసులో కూడా పీపీఎఫ్‌ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్‌ అకౌంట్‌ 15 సంవత్సరాలలో మెచ్యూర్ అయితే వార్షిక వడ్డీ రేటు 7.1 శాతం అందజేస్తోంది కేంద్ర ప్రభుత్వం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆన్‌లైన్‌లో పీపీఎఫ్‌ అకౌంట్‌ను ఓపెన్ చేయాలంటే.. మీ సేవింగ్స్ అకౌంట్ కేవైసీని తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా మీరు రూ.1,50 వేల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. 


ఎస్‌బీఐలో పీపీఎఫ్‌ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలంటే..


==> ముందుగా ఇంటర్‌నెట్ బ్యాంకింగ్‌లో ఎస్‌బీఐ అకౌంట్‌కు లాగిన్ అవ్వండి.
==> 'రిక్వెస్ట్ అండ్ ఎంక్వరీ' ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
==> డ్రాప్-డౌన్ మెను నుంచి న్యూ పీపీఎఫ్ అకౌంట్స్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
==> ఈ పేజీలో పాన్ నంబరు, ఇతరు వివరాలను కనిపిస్తాయి.
==> మీరు మైనర్ పేరుతో అకౌంట్‌ను ఓపెన్ చేయాలంటే.. మీరు ఆ ట్యాబ్‌లో చెక్ చేయాలి.
==> మీరు మైనర్ పేరుతో ఖాతాను తెరవకూడదనుకుంటే.. మీరు మీ PPF ఖాతాను తెరవాలనుకుంటున్న బ్రాంచ్ కోడ్‌ను నమోదు చేయాలి.
==> మీ అకౌంట్ వివరాలు, అడ్రస్, నామినీ మొదలైన వాటికి సంబంధించిన సమాచారాన్ని ధృవీకరించాలి. దీని తర్వాత ప్రొసీడ్‌పై క్లిక్ చేయండి.
==> సబ్మిట్ చేసిన తరువాత'మీ ఫారమ్ విజయవంతంగా సబ్మిట్ అయింది' అని మెసేజ్ కనిపిస్తుంది. అక్కడ మీ రిఫరెన్స్ నంబర్ కూడా ఉంటుంది.
==> రిఫరెన్స్ నంబర్‌తో ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
==> 'ప్రింట్ పీపీఎఫ్‌ ఆన్‌లైన్ అప్లికేషన్' ట్యాబ్ నుంచి అకౌంట్ ప్రారంభ ఫారమ్‌ను ప్రింట్ తీసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ నుంచి 30 రోజులలోపు దానిని కేవైసీ డాక్యుమెంట్, ఫోటోతో పాటు బ్రాంచ్‌లో సబ్మిట్ చేయండి.


ఇది కూడా చదవండి : Rain Alert: ఏపీ, తెలంగాణకు వర్ష సూచన, ఎండలు-ఉక్కపోత నుంచి ఉపశమనం


ఇది కూడా చదవండి : Israel Hamas War: హమాస్ ఉగ్రవాదులను ఏరివేతకు ఇజ్రాయెల్ సైన్యం విశ్వప్రయత్నాలు..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..