PPF Vs EPF: మీరు రిటైర్మెంట్కు ప్లాన్ చేస్తున్నారా..? వడ్డీ ఎక్కువ వచ్చే పథకాలు ఇవే..!
Retirement Plan PPF vs EPF: దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పథకాలలో పీపీఎఫ్ ఒకటి. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే డబ్బు సురక్షితంగా ఉండడంతోపాటు మంచి లాభాలు ఉన్నాయి. ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన ఈపీఎఫ్ నుంచి పదవీ విరమణ సమయానికి పెద్ద మొత్తంలో డబ్బును జమ చేసుకోవచ్చు.
Retirement Plan PPF vs EPF: ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న ప్రతిఒక్కరు భవిష్యత్ అవసరాల కోసం ఎంతో కొంత పొదుపు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా రిటైర్మెంట్ తరువాత ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటున్నారు. అందుకే ఇప్పటి నుంచి జీతం నుంచి కొంత డబ్బును పొదుపు చేసుకుంటూ.. మంచి ఆదాయం వచ్చే పథకాలలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇందుకోసం అనేక ప్రభుత్వ, ప్రైవేట్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే రెండు ప్రభుత్వ పథకాలు మాత్రం ఎక్కువ రాబడిని ఇస్తున్నాయి.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) పథకాలకు ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారు. మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తుంటే ఈ రెండు పథకాలలో ఏదో బెటర్ తప్పకుండా తెసుకోండి. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అనేది ప్రతి నెల జీతం పొందుతున్న వ్యక్తుల ప్రవేశపెట్టిన రిటైర్మెంట్ బెనిఫిట్ ప్లాన్. అంటే ఉద్యోగులు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకుని.. తమ పదవీ విరమణ ఒకేసారి భారీ మొత్తంలో డబ్బును పొందొచ్చు. పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించడం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం లక్ష్యం.
ఈపీఎఫ్‌లో ఇప్పటినుంచే ఇన్వెస్ట్ చేస్తే.. రిటైర్మెంట్ సమయానికి భారీ మొత్తంలో ఫండ్‌ను జమ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై 8.1 శాతం వార్షిక వడ్డీ రేటును ప్రభుత్వం ఆఫర్ చేస్తోంది. ఈపీఎఫ్‌లో ఉద్యోగి బేసిక్ శాలరీ నుంచి 12 శాతం కంట్రిబ్యూషన్ ఉంటుంది. కంపెనీ మరో 12 శాతం జమ చేస్తుంది. ఈ డబ్బును ఉద్యోగి పదవీ విరమణ తర్వాత లేదా కంపెనీని విడిచిపెట్టిన విత్‌డ్రా చేసుకోవచ్చు.
Also Read: Covid19 Cases in India: ఆందోళన కల్గిస్తున్న కరోనా వైరస్, 24 గంటల్లో 10వేల కేసులు
పీపీఎఫ్‌లో ఎవరైనా డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో వడ్డీ రేట్లను సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకంలో కనీసం రూ.500తో ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించవచ్చు. దీనికి 15 సంవత్సరాల లాక్ ఇన్ పిరియడ్ ఉంటుంది. ఈ పథకంలో లోన్ సదుపాయం కూడా ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించిన మూడేళ్ల తరువాత లోన్ పొందొచ్చు. ఈపీఎఫ్‌లో కూడా లోన్ తీసుకోవచ్చు. మెడికల్ ఎమర్జెన్సీ, ఇల్లు, పిల్లల చదువు మొదలైన వాటి కోసం ఈపీఎఫ్ ఖాతా నుంచి రుణం తీసుకోవచ్చు.
Also Read: CSK vs RR Highlights: తలైవా మ్యాజిక్.. రికార్డుస్థాయిలో వ్యూస్.. ధోని మెరుపులు ఎంతమంది చూశారంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook