PF Balance Check: ఎస్ఎంఎస్ లేదా మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఎలా
PF Balance Check: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు తప్పకుండా ఉండే సౌకర్యం పీఎఫ్ ఎక్కౌంట్. భవిష్యత్తుకు పనికొచ్చే అద్భుతమైన సేవింగ్ పధకమిది. ఇప్పుుడు మీ పీఎఫ్ బ్యాలెన్స్ క్షణాల్లో తెలుసుకునే వెసులుబాటు వచ్చేసింది. అదెలాగో తెలుసుకుందాం..
PF Balance Check: పీఎఫ్ ఎక్కౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందనేది ఆన్‌లైన్ ద్వారా తెలుసుకునే వీలుండేది. కానీ ఇప్పుడు అంతకంటే సులభంగా మెస్సేజ్ ద్వారా సులభంగా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ డేటా అవసరం లేకుండానే కేవలం టెక్స్ట్ మెస్సేజ్‌తో తెలుసుకోవచ్చు.
పీఎఫ్ బ్యాలెన్స్ సులభంగా తెలుసుకోవడం ఎలా
How to check PF Balance in Simple Ways
మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి EPFOHO అని టైప్ చేసి మీ యూఏఎన్ నెంబర్ నమోదు చేసి 7738299899 నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే చాలు వెంటనే మీ బ్యాలెన్స్ ఎంతో ఎస్ఎంఎస్ వచ్చేస్తుంది.
మిస్డ్ కాల్ ద్వారా కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. 9966044425 నెంబర్‌కు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇస్తే చాలు మీ బ్యాలెన్స్ ఎంత ఉందో క్షణాల్లో తెలిసిపోతుంది.
మీ పీఎఫ్ బ్యాలెన్స్‌పై ప్రభుత్వం ఎప్పటికప్పుడు డిపాజిట్ చేసే వడ్డీ డబ్బులతో పీఎఫ్ బ్యాలెన్స్ పెరుగుతుంటుంది. ఇంతకుముంందైతే పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ ఓపెన్ చేసి వివరాలు ఎంటర్ చేసి తెలుసుకోవల్సి వచ్చేది. దీనివల్ల సమయం ఎక్కువ పట్టడమే కాకుండా ఇంటర్నెట్ డేటా అవసరమయ్యేది. ఇప్పుడిక ఆ అవసరం లేకుండా ఎస్ఎంఎస్ లేదా మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook