Saving Schemes Rules: పీపీఎఫ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ పథకాల్లో మార్పులు, కొత్త నిబంధనలు ఇలా
Saving Schemes Rules: రిస్క్ లేకుండా అధిక రిటర్న్స్ అందించే ప్రభుత్వ గ్యారంటీ కలిగిన పధకాల్లో ముఖ్యమైనవి పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ ఇలా చాలానే ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు వీటికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ పథకాల నియమ నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేస్తుంటుంది.
Saving Schemes Rules: అదే విధంగా పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ అంటే పీపీఎఫ్ విషయంలో కూడా నిబంధనల్లో మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. పీపీఎఫ్ అనేది వివిధ పోస్టాఫీసులు, బ్యాంకుల్లో అందుబాటులో ఉండే ప్రభుత్వ గ్యారంటీ కలిగిన పధకం. ముందస్తుగా ఈ పధకాన్ని క్లోజ్ చేస్తే వర్తించే నిబంధనల్లో ప్రభుత్వం మార్పు చేసింది. గత ఏడాది నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
కేంద్ర ప్రభుత్వం గ్యారంటీతో వివిధ రకాల సేవింగ్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఇన్వెస్ట్‌మెంట్‌కు జీరో రిస్క్ ఉంటుంది. రిటర్న్స్ అధికంగా ఉంటాయి. అందుకే చాలామంది ముఖ్యంగా రిటైర్ అయినవాళ్లు ఈ పధకాలపై ఆసక్తి చూపిస్తుంటారు. ప్రభుత్వం ఈ తరహా సేవింగ్ పధకాలైన పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్‌లలో మార్పులు చేసింది. ఈ మార్పుల ప్రకారం ఈ పధకాలు ఇకపై మరింత ఆకర్షణీయం కానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ ఓపెన్ చేసేందుకు మూడు నెలల సమయం ఉంటుంది. గత ఏడాది నవంబర్ 9వ తేదీన దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది. అంటే రిటైర్ అయిన మూడు నెలల్లోగా ఆ డబ్బును ఇన్వెస్ట్ చేయవచ్చు. రిటైర్మెంట్ ప్రూఫ్ డేట్ ఒక్కటి సమర్పిస్తే సరిపోతుంది. ఈ పథకంపై ప్రభుత్వం ఆకర్షణీయమైన వడ్డీ అందిస్తుంది.
అదే విధంగా పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ ఎక్కొంట్ ముందస్తుగా క్లోజ్ చేసే రూల్స్ కూడా మారాయి. పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ అమెండ్ మెంట్ స్కీమ్ 2023 ప్రకారం ముందుగా ఎక్కౌంట్ క్లోజ్ చేయాలంటే కొన్ని మినహాయింపులు వర్తిస్తాయి. ఐదేళ్ల కాల పరిమితి కలిగిన ఎక్కౌంట్‌లో నాలుగేళ్ల తరువాత డబ్బులు విత్ డ్రా చేయాలంటే పోస్టాఫీసు సేవింగ్ ఎక్కౌంట్ వడ్డీ రేటు వర్తిస్తుంది.
ప్రస్తుతం ఐదేళ్ల కాల పరిమితి కలిగిన డిపాజిట్ ఎక్కౌంట్‌ను నాలుగేళ్ల తరువాత క్లోజ్ చేస్తే మూడేళ్ల డిపాజిట్ వడ్డీ వర్తిస్తుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మొత్తం 9 రకాల సేవింగ్ స్కీమ్స్ అందిస్తోంది. ఇందులో రికరింగ్ డిపాజిట్, పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వంటివి ఉన్నాయి. దేశంలోని అన్ని పోస్టాఫీసుల్లో, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ గ్యారంటీ కలిగి ఉండటంతో రిస్క్ ఏమాత్రం ఉండదు. పైపెచ్చు వడ్డజీ అధికంగా ఉంటుంది.
Also read: Post office Superhit Scheme: ఈ పోస్టాఫీసు స్కీమ్‌తో ప్రతి నెలా గ్యారంటీ ఆదాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook