PPF Investment: రోజుకు 400 రూపాయలు పెట్టుబడితో 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు
PPF Investment: పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ అనేది రిస్క్ లేని అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే చాలామంది నిస్సంకోచంగా ఇందులో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఈ పధకం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
PPF Investment: భవిష్యత్తులో అద్భుతమైన రిటర్న్స్ పొందాలంటే పీపీఎఫ్ బెస్ట్ ఆప్షన్. కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ కలిగిన పధకం కావడంతో రిస్క్ ఏ మాత్రం ఉండదు. అందుకే జనం ఈ పధకంపై ఆసక్తి చూపిస్తుంటారు. పీపీఎఫ్ పథకంలో రోజుకు 400 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా 1 కోటి రూపాయలు అందుకోవచ్చు.
పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ పధకంలో ఇన్వెస్ట్ చేసే డబ్బులకు ఎలాంటి ఢోకా ఉండదు. పీపీఎఫ్ పధకం దేశంలోని అన్ని స్మాల్ సేవింగ్ పథకాల కంటే అత్యధిక ప్రాచుర్యం పొందింది. ఈ పధకంలో కనీస పెట్టుబడి ఏడాదికి 500 రూపాయలు కాగా గరిష్టంగా 1.5 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. ఒకే ఏడాదిలో 1.5 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే ఎలాంటి వడ్డీ ఉండదు. పీపీఎఫ్ పధకంలో డబ్బులు ఒకేసారి లేదా వాయిదాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ పధకంలో ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ పధకంపై 7.1 వడ్డీ అందిస్తోంది. కాంపౌండ్ వడ్డీ కూడా ఉంటుంది. వడ్డీ అనేది ప్రతి యేటా మార్చ్ నాటికి చెల్లిస్తారు. కేంద్ర ప్రభుత్వం పీపీఎఫ్ పధకంపై వడ్డీని ప్రతి మూడు నెలలకోసారి సమీక్షిస్తుంటుంది. ఈ పధకంలో ఇన్వెస్ట్ చేసే మొత్తంపై ఇన్‌కంటాక్స్ మినహాయింపు కూడా ఉంటుంది. సెక్షన్ 80సి ప్రకారం లబ్ది పొందవచ్చు. పీపీఎఫ్ అనేది 15 ఏళ్ల కాలవ్యవధికి ఉంటుంది. 15 ఏళ్లు పూర్తయ్యాక..మరో ఐదేళ్లు పొడిగించవచ్చు. అంతేకాకుండా అత్యవసరమైతే 50 శాతం విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఎక్కౌంట్ ఓపెన్ చేసి కనీసం 6 ఏళ్లు పూర్తి కావల్సి ఉంటుంది.
ఈ పధకంలో రోజుకు 405 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి 1 లక్షా 47 వేల 850 రూపాయలౌతుంది. 25 ఏళ్లకు 7.1 శాతం వడ్డీతో 1 కోటి రూపాయలౌతుంది. ఈ పధకం దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల్లో కూడా అందుబాటులో ఉంది.
Also read: Income Tax Notices: రిటర్న్స్ ఫైల్ చేయలేదా, అయితే నోటీసులు అందుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook