PNB New Rules: దేశంలో రెండవ అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు షాక్ కల్గిస్తోంది. మినిమమ్ బ్యాలెన్స్, మెయింటెనెన్స్ ఛార్జీలు విపరీతంగా పెంచేసింది. ఆ వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పంజాబ్ నేషనల్ బ్యాంక్..ప్రైవేటు బ్యాంకులకు పోటీగా కస్టమర్ల జేబు గుల్లచేసేందుకు సిద్ధమైంది. మినిమమ్ బ్యాలెన్స్ , ఇతర సర్వీస్ ఛార్జీలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొత్త  నిబంధనల గురించి తెలుసుకోకపోతే..ఖాతాలో డబ్బులు కట్ అయిపోతాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తాజాగా మార్చిన నిబంధనల్ని బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. దీని ప్రకారం..


పట్టణ ప్రాంతాల్లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖతాదారులు తమ అకౌంట్‌లో కనీసం పది వేల రూపాయలు బ్యాలెన్స్‌గా ఉంచాలి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పట్టణాల్లో సగటు బ్యాలెన్స్ కనీస పరిమితిని త్రైమాసిక ప్రాతిపదికన 5వేల రూపాయల నుంచి 10 వేల రూపాయలకు పెంచారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులు తమ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోవడంతో గతంలో 300 రూపాయలు ఉన్న ఛార్జీని తాజాగా 600 రూపాయలకు పెంచారు. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల అకౌంట్లకు త్రైమాసిక ప్రాతిపదికన మినిమమ్ బ్యాలెన్స్‌ను మెయింటెయిన్ చేయకపోతే 400 రూపాయలు..సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలకు మినిమమ్ బ్యాలెన్స్ పరిమితిని వెయ్యి రూపాయలుగా నిర్ణయించింది పంజాబ్ నేషనల్ బ్యాంక్. 


మరోవైపు లాకర్ ఛార్జీలలో వచ్చిన మార్పులు అన్ని రకాల లాకర్లను ప్రభావితం చేశాయి. గతంలో చిన్న సైజు లాకర్ ఛార్జీ గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి రూపాయలు ఉండగా..జనవరి 15వ తేది నుంచి 1250 రూపాయలు పెంచారు. పట్టణ ప్రాంతాల్లో లాకర్ ఛార్జీని 2వేల రూపాయలకు పెంచారు. గ్రామీణ ప్రాంతాల్లో మీడియం సైజ్ లాక్ ధరను రెండు వేల రూపాయల నుంచి 2వేల 500 రూపాయలుగా నిర్ణయించారు. పట్టణ ప్రాంతాల్లో మూడు వేల రూపాయల నుంచి 3500 రూపాయలకు లాకర్ ధరను పెంచారు. పెద్ద లాకర్ ఛార్జీ గ్రామీణ ప్రాంతాల్లో 2 వేల 500 నుంచి 3వేలకు..పట్టణ ప్రాంతాల్లో 5వేల నుంచి 5 వేల 500 రూపాయలకు పెంచారు. రూరల్ ప్రాంతాల్లో భారీ లాకర్ ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు. పంజాబ్ నేషన్ బ్యాంక్ లాకర్ హూల్డర్లు ఏడాదికి 12 సార్లు ఉచితంగా ఓపెన్ చేయవచ్చు. లాకర్ ప్రతి అదనపు సందర్శనకు 100 రూపాయలు వసూలు చేస్తారు. గతంలో ఈ నిబంధన 15 సార్లుండేది. 


ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్ క్లోజింగ్ ఛార్జీలను కూడా పెంచింది. కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసిన 14 రోజుల కంటే ఎక్కువ రోజులు నుంచి ఏడాదిలోపు అకౌంట్ క్లోజ్ చేస్తే దాని ఛార్జీ గతంలో 600 రూపాయలుగా ఉండేది. ప్రస్తుతం అకౌంట్ క్లోజింగ్ ఛార్జీ రెటును 800 రూపాయలకు పెంచింది పంజాబ్ నేషనల్ బ్యాంక్. బ్యాంక్ సర్వీస్ ఛార్జీలను పెంచడంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.


Also read: AC offers: అమెజాన్ సమ్మర్ స్పెషల్​ ఆఫర్స్​- ఏసీలపై సూపర్ కూల్ డిస్కౌంట్స్​..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook