PNB FD Rates: దేశంలో అగ్రగామి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెండో స్థానంలో ఉన్నది పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇతర బ్యాంకులతో పోలిస్తే ఈ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ అందిస్తోంది. బ్యాంకు ఇటీవలే వడ్డీ రేట్లు పెంచింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పంజాబ్ నేషనల్ బ్యాంక్ పెంచిన వడ్డీ రేట్లు జనవరి 8 నుంచి అమల్లోకి వచ్చాయి. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై నెలలో రెండోసారి వడ్డీ రేటు పెంచింది పీఎన్‌బీ. సింగిల్ టెన్యూర్ డిపాజిట్లపై 80 బేసిస్ పాయింట్లు వడ్డీ పెంచింది. అంతకుముందు జనవరి 1న కొన్ని రకాల డిపాజిట్లపై 45 బేసిస్ పాయింట్లు వడ్డీ రేటు పెంచింది. 300 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీను 6.25 శాతం నుంచి 7.05 శాతానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ పెంచింది. సాధారణ పౌరులకు 7 రోజుల్నించి 10 ఏళ్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.5 శాతం నుంచి 7.25 శాతం వడ్డీ అందిస్తోంది. 


పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు వర్సెస్ కాల వ్యవధి


7 నుంచి 45 రోజులు 3.50 శాతం
46 నుంచి 179 రోజులు 4.50 శాతం
180 నుంచి 270 రోజులు 6 శాతం
271 నుంచి 299 రోజులు 6.25 శాతం
300 రోజులకైతే 7.05 శాతం
301 రోజుల్నించి 1 ఏడాది వరకూ అయితే 6.25 శాతం
1 ఏడాదికి అయితే 6.75 శాతం
400 రోజులకు అయితే 7.25 శాతం
401 రోజుల్నించి 2 ఏళ్ల వరకూ 6.80 శాతం
2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల వరకూ 7 శాతం
3 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు 6.50 శాతం
5 ఏళ్ల నుంచి 10 ఏళ్లు 6.50 శాతం


తాజాగా చేసిన పెంపు తరువాత సీనియర్ సిటిజన్లకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ 4.3 శాతం నుంటి అత్యధికంగా 8.05 శాతం వడ్డీ ఇస్తోంది. అత్యధిక వడ్డీ 8 శాతం అనేది సూపర్ సీనియర్ సిటిజన్లకు వర్తిస్తుంది. 


Also read: UPI New Changes 2024: యూపీఐలో మార్పులు, రోజుకు లిమిట్, పేమెంట్ ఛార్జీలు ఇలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook