PNB has reduced interest rate on savings account deposits: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్​బీ) ఖాతాదారులకు షాకిచ్చింది. సేవింగ్స్ ఖాతాదారులకు ఇచ్చే వడ్డీ రేట్లను తగ్గిస్తూ (PNB interest  rates) తాజాగా నిర్ణయం తీసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లతో పోలిస్తే.. 5-10 బేసిస్​ పాయింట్ల వడ్డీ తగ్గిస్తున్నట్లు వివరించింది. తగ్గించిన వడ్డీ రేట్లు డిసెంబర్ 1 నుంచి (PNB new Interest rates) అమలులోకి రానున్నాయి.


కొత్త వడ్డీ రేట్లు ఇలా..


సేవింగ్స్​ ఖాతాలో రూ.10 లక్షల లోపు డిపాజిట్​పై 2.80 శాతం వడ్డీ ఇవ్వనున్నట్లు తెలిపింది పీఎన్​బీ. రూ.10 లక్షలు దాటిన డిపాజిట్లపై 2.85 శాతం పొందొచ్చని వివరించింది. ప్రస్తుతం ఈ వడ్డీ రేట్లు 2.90 వద్ద ఉండటం గమనార్హం.


అయితే ఫిక్స్​డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు పీఎన్​బీ. త్వరలోనే వీటిని కూడా సవరించే వీలుంది.


Also read: Ganja : హైదరాబాద్ కౌకుర్‌‌లో రూ కోటి విలువైన గంజాయి స్వాధీనం


Also read: Adipurush Shooting Completed: 103 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రభాస్ ‘ఆదిపురుష్’


ఈ ఏడాది రెండో సారి


పంజాబ్ నేషనల్ బ్యాంక్ సేవింగ్స ఖాతాలకు వడ్డీ రేట్లను తగ్గించడం ఈ ఏడాది ద్వీతీయార్ధంలోనే ఇది రెండో సారి. ఇందుకు ముందు కూడా సెప్టెంబర్​ 1న వడ్డీ రేట్లను తగ్గించింది. రూ.100 కోట్ల వరకు డిపాజిట్లపై 3 శాతం వడ్డీ ఇవ్వగా.. సెప్టెంబర్​లో 10 బేసిస్ పాయింట్ల వడ్డీ కోత విధించింది. దీనితో వడ్డీ రేట్లు 2.9 శాతానికి చేరాయి. ఇప్పుడు దానిని కూడా తగ్గించింది.


పీఎన్​బీ వంటి దిగ్గజ బ్యంకులు సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ కోత విధిస్తుంటే.. పలు చిన్న చిన్న బ్యాంకులు మాత్రం భారీ వడ్డీ ఇస్తూ ఖాతాదారులను ఆకర్షిస్తున్నాయి. 


ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, ఈక్విటాస్​ ఫినాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్​ స్మాల్​ ఫినాన్స్ బ్యాంకులు ఈ కోవలోకి వచ్చేవే. ఈ బ్యాంకులు కనిష్ఠంగా 6.25 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీని ఇస్తున్నాయి.


అయితే ఈ బ్యాంకుల్లో నెలవారీగా కనీస నిల్వ ఉంచాలనే నిబంధనల ఉంది.


Also read: Electric Scooter: దేశంలో కారుచౌక ధరకే అందుబాటులో రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్


Also read: Gold Smuggling: శానిటరీ ప్యాడ్స్ లో గోల్డ్ స్మగ్లింగ్.. ఎయిర్ ఇండియా ఎంప్లాయ్ అరెస్టు


ఏ బ్యాంక్​లో ఎంత?


 ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్​లో సేవింగ్స్​ ఖాతాలో నెలవారీ నిల్వ సగటు రూ.2000 నుంచి రూ.5000 వరకు ఉంది. దీనిలో వడ్డీ రేటు 7 శాతం వరకు ఉంది.


ఈక్విటాస్​ ఫినాన్స్ బ్యాంక్​లో..


ప్రత నెల కనీసం రూ.2,500 నుంచి రూ.10 వేల వరకు నిల్వ ఉంచాలి. దీనిలో కూడా వడ్డీ రేటు 7 శాతం వరకు ఉంది.


ఉజ్జీవన్ స్మాల్​ ఫినాన్స్ బ్యాంక్..


ఇందులో నెలవారీ బ్యాలెన్స్‌ రూ. 2000 వరకు ఉండాలి. ఈ బ్యాంక్ సేవింగ్స్​ ఖాతాపై 6.25 శాతం వరకు వడ్డీ పొందొచ్చు.


Also read: Equity Mutual Funds: ఈక్విటీ మార్కెట్‌లో పురోగతి, భారీగా పెట్టుబడులు


Also read: China New Rules: ఆ విదేశీ కంపెనీలు చైనాను ఎందుకు వదిలేశాయి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook