Ratan Tata hilarious reply to Netizens: రతన్‌ టాటా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేత్తల్లో ఒకరు. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనుకునే ఎంతో మందికి ఆయన స్ఫూర్తి. లక్షల కోట్లకి అధిపతి, ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన వ్యాపార సామ్రజ్యం ఉనప్పటికి ఎలాంటి గర్వం ఉండదు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉంటే తత్వం ఈయనకు ఇతరుల కన్నా ప్రత్యక స్థానం అందించింది. అంత ఆస్థి ఉండికూడా చాలా సాధారణమైన జీవనాన్ని కొనసాగిస్తారు.  ఆయనను ప్రతిఒక్కరు అభిమానిస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా 2019 అక్టోబర్ మాసంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. ఖాతా ఓపెన్ చేసిన నాలుగు నెలల్లోనే ఆయన ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య ఒక మిలియన్ (పది లక్ష్యలు) మార్కును చేరుకుంది. దీన్ని బట్టి అయన ఫాలోయింగ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. పారిశ్రామిక రంగంలోనే కాకుండా నెట్టింట కూడా లెజెండ్ అనిపించుకున్నారు. ప్రస్తుతం రతన్ టాటాకు 5.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. అయితే రతన్ టాటా ఒక మిలియన్ మారును చేరుకున్నప్పటి ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మిలియన్ ఫాలోవర్ల మార్కును చేరుకున్నప్పుడు రతన్ టాటా అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు. 'నా ఇన్‌స్టా పేజీలో ఫాలోవర్ల సంఖ్య ఒక మిలియన్ మైలురాయిని తాకటం ఇప్పుడే చూశాను. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చేరినప్పుడు ఇంత అద్భుతమైన ఆన్‌లైన్ కుటుంబం ఉంటుందని ఊహించలేదు. అందరికి ధన్యవాదాలు. ఈ ఇంటర్నెట్ యుగంలో మనం ఇంతటి విలువైన బంధాలను ఏర్పరుచుకోవడం చాలా గొప్పగా ఉంది. మీ నుండి చాలా నేర్చుకోవడం నిజంగా సంతోషంగా ఉంది. మీతో కలిసి ఈ ప్రయాణం కొనసాగుతుందని ఆశిస్తున్నా' అని రతన్ టాటా ట్వీట్ చేశారు. 


రతన్ టాటా చేసిన ఆ ట్వీట్ వైరల్ అయింది. ప్రతిఒక్కక్కరు అతనికి కంగ్రాట్స్ చెప్పారు. ఓ అమ్మాయి మాత్రం 'అభినందనలు ఛోటూ' అంటూ రిప్లై ఇచ్చింది. వెంటనే ఆ అమ్మాయిని నెటిజన్లు ట్రోల్ చేశారు. అంతటి గొప్ప మనిషిని ఛోటూ అని పిలవడం అవమానకరం, అగౌరవం అని పేర్కొన్నారు. ఈ విమర్శలపై ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా స్పందిస్తూ... 'మనలోని ప్రతి ఒక్కరిలో ఒక పిల్లవాడు ఉంటాడు. ఆ అమ్మాయిని నిందించకండి. గౌరవంగా చూసుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను' అని పేర్కొన్నారు. దాంతో నెటిజన్లు శాంతించారు.  


Also Read: Mahesh Babu: 'సర్కారు వారి పాట'లో మహేష్ చిన్నప్పటి క్యారెక్టర్‌లో ఎవరు నటించారో తెలుసా?


Also Read: Deepak Hooda: నా చిన్ననాటి కల నెరవేరింది.. విరాట్ కోహ్లీకి థాంక్స్: దీపక్‌ హుడా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook