2000 Notes: 2 వేల రూపాయల నోట్లు ఇంకా మిగిలున్నాయా, ఇలా మార్చుకోండి
2000 Notes: రద్దయిన 2 వేల రూపాయల నోట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన అప్డేట్ జారీ చేసింది. 2 వేల రూపాయల నోట్లు ఇంకా మార్చుకునేందుకు అవకాశముందా లేదా, ఇంకా 2 వేల రూపాయల నోట్లు మిగిలి ఉంటే ఏం చేయాలి..ఆ వివరాలు తెలుసుకుందాం.
2000 Notes: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 వేల రూపాయల నోట్లను రద్దు చేసి అప్పుడే ఏడాది దాటేసింది. గత ఏడాది మే 19వ తేదీన 2 వేల రూపాయల నోట్ల ఆర్బీఐ ఉపసంహరించుకుంది. అప్పటికే మార్కెట్‌లో ఉన్న 3.56 లక్షల కోట్ల నోట్లను మార్చుకునేందుకు 2023 సెప్టెంబర్ వరకూ గడువు ఇచ్చి ఆ తరువాత మరోసారి పొడిగించింది. అయినా ఇప్పటికీ 2 వేల రూపాయల నోట్లు మారకుండా మిగిలిపోయాయి.
ఆర్బీఐ అంచనాల ప్రకారం మార్కెట్‌లో లేదా జనాల వద్ద 7 వేల కోట్ల 2 వేల రూపాయల నోట్లు మిగిలిపోయాయి. 98 శాతం నోట్లు ఆర్బీఐకు వెనక్కి వచ్చేశాయి. కానీ ఇంకా ఇప్పటికే 7,117 కోట్లు పింక్ నోట్లు మారకుండా ఉండిపోయాయి. 2 వేల రూపాయల నోట్లను వెనక్కి తీసుకునే ప్రక్రియ మొదట్లో వేగంగా ఉండింది. కానీ ఇప్పుడు పూర్తిగా మందగించింది. జూలై 1 నాటికి మార్కెట్‌లో 7581 కోట్ల విలువైన 2 వేల రూపాయల నోట్లు ఉండిపోగా సెప్టెంబర్ 1 నాటికి ఈ సంఖ్య 7 వేల కోట్లకు తగ్గింది. అంటే రెండు నెలల్లో కేవలం 320 కోట్ల విలువైన 2 వేల రూపాయల నోట్లే వెనక్కి వచ్చాయి. గత ఏడాది అంటే 2023 మేలో పింక్ నోట్లను బ్యాన్ చేసినప్పుడు మార్కెట్‌లో 3.56 లక్షల కోట్ల నోట్లున్నాయి. గత ఏడాది డిసెంబర్ నాటికి ఈ సంఖ్య 9,330 కోట్లకు తగ్గింది.
ఆర్బీఐ క్లీన్ నోట్ పాలసీలో భాగంగా 2 వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంది. ప్రారంభంలో స్థానిక బ్యాంకులు, పోస్టాఫీసులు, 19 ఆర్బీఐ రీజనల్ కార్యాలయాల్లో మార్చుకునేందుకు అవకాశం ఉండగా ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పటికీ మీ వద్ద 2 వేల రూపాయల నోట్లు మిగిలిపోయుంటే మార్చుకునేందుకు ఇంకా అవకాశముంది. అయితే స్థానిక బ్యాంకుల్లో ఈ సౌకర్యం లేదు. దేశంలోని 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే మార్చుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో 7 వేల కోట్ల విలువైన 2 వేల రూపాయల నోట్లు మిగిలిపోయాయి. ఇవి మార్చుకోవాలంటే అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగడ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూ ఢిల్లీ, పాట్నా తిరువనంతపురం కేంద్రాల్లో మార్చుకోవచ్చు.
Also read: 7th Pay Commission DA Hike: ఉద్యోగులకు దసరా కానుక, అక్టోబర్ 9న డీఏ పెంపు ప్రకటన, ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.