RBI Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త.. బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) భారీగా ఉద్యోగాలను ప్రకటించింది. ఉద్యోగాల కోసం చూస్తున్న వారు చివరి నిమిషం వరకు వేచి ఉండి.. అప్లికేషన్​లో పొరపాట్లు చేయకుండా.. ముందుగా, వీలైనంత త్వరగా ఈ దరఖాస్తును పూర్తి చేయడం మేలు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధరఖాస్తు చేసేందుకు చివరి తేదీ..


ఆర్​బీఐకి చెందిన వివిధ కార్యాలయాల్లో 'అసిస్టెంట్​' పోస్ట్​లకు దరఖాస్తులు ఆహ్వానించింది. మొత్తం  950 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపింది.


ఈ పోస్టులకు సంబంధించి ఫిబ్రవరి 17 నుంచే దరఖాస్తులను స్వీకరిస్తోంది. అప్లికేషన్ సబ్మిట్ చేసేందుకు మార్చి 8 చివరి తేదీ.


చివరి తేదీలోపు మరోసారి అప్లికేషన్​ను ఎడిట్​ చేసుకునే అవకాశం కూడా ఉన్నట్లు ఆర్​బీఐ.


అప్లికేషన్​ను సమర్పించేందుకు నిర్ణీత ఫీజును చెల్లించాల్సి ఉంటుందని ఆర్​బీఐ స్పష్టం చేసింది.


దరఖాస్తు చేయండం ఎలా..


  • ఆర్​బీఐ అధికారిక వెబ్​సైట్​లోకి లాగిన్​ కావాలి.

  • హోం పేజీలో కరెంట్​ వేకెన్సిస్​ అనే ఆప్షన్​ను ఎంచుకోవాలి

  • ఇక్కడ 'రిక్రూట్​మెంట్​ ఫర్​ ది పోస్ట్​ ఆఫ్​ అసిస్టెంట్​-2022' ఆప్షన్​ కనిపిస్తుంది.

  • కొత్తగా ధరఖాస్తు చేస్తుంటే.. న్యూ రిజిస్ట్రేషన్​పై క్లిక్​ చేయాలి. ఇప్పటికే రిజిస్ట్రేషన్​ చేసుకుని ఉంటే ఐడీ, పాస్​వర్డ్​ను ఉపయోగించి లాగిన్ కావాలి.

  • లాగిన్ అయిన తర్వాత.. అప్లికేషన్​ ఫారం కనిపిస్తుంది. ఇందులో అడిగిన అన్ని వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.

  • ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి

  • ఈ ప్రాసెస్​ పూర్తయిన తర్వాత ప్రివ్యూ చూసుకోవాలి. ఒక వేళ ఎక్కడైనా తప్పులు ఉన్నట్లు కనిపిస్తే.. ఎడిట్​ చేసుకోవచ్చు. ఆ తర్వాత సేవ్​పై క్లిక్​ చేయాలి.

  • చివరగా నిర్ణీత ఫీజులు చెల్లించి.. అప్లికేషన్​ పూర్తి చేస్తే సరిపోతుంది.


పరీక్ష, ఎంపిక విధానం..


ఈ పోస్ట్​ కోసం రెండు దశల్లో ఎగ్జామ్​ ఉంటుంది. ప్రీలిమ్స్​ వచ్చే నెల 26 లేదా 27న ఉండే అవకాశముంది. మెయిన్స్​ మే నెలలో నిర్వహించే వీలుంది.


Also read: Airtel Recharge Plan: ఎయిర్ టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఏడాది పాటు ఉచిత ఓటీటీ సబ్ స్క్రిప్షన్!


Also read: Todays Gold Rate: దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళి బంగారం ధరలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook