Reserve Bank Keeps Repo Rate Unchanged: లోన్లు తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. ఆర్‌బీఐ గురువారం తన ద్రవ్య విధానాన్ని ప్రకటించింది. రెపో రేటు, రివర్స్ రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. రెపో రేటును 6.50 శాతం వద్దే కొనసాగిస్తునట్లు వెల్లడించారు. ఆర్‌బీఐ రెపోరేటును పెంచకపోవడంతో లోన్‌ల వడ్డీ రేట్లు యధాతంగా కొనసాగనున్నాయి. ఆర్‌బీఐ రెపోరేటును పెంచకపోవడంతో బ్యాంకులకు వడ్డీ రేట్లు పెంచేందుకు అవకాశం లేదు. ఆర్‌బీఐ ఆరు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల సమావేశం ఆగస్టు 8 నుంచి 10 వరకు జరిగింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎంపీసీ సమావేశ వివరాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ద్రవ్యోల్బణం తగ్గింపుపై దృష్టి సారించిందన్నట్లు తెలిపారు. మన ఆర్థిక వ్యవస్థలో వృద్ధి యథాతథంగా ఉందన్నారు. ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యం కంటే ఎక్కువగా ఉన్నా.. 4 శాతం ద్రవ్యోల్బణ రేటును సాధించడానికి కట్టుబడి ఉందన్నారు. ప్రధాన ద్రవ్యోల్బణం రేటు తగ్గుతోందని.. దీని ప్రభావం పాలసీ రేట్లపై కూడా కనిపిస్తుందని అన్నారు. జూలై-ఆగస్టులో ద్రవ్యోల్బణం రేటు ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. కూరగాయల ద్రవ్యోల్బణం రేటు పెరగడం వల్ల ఇది ప్రధానంగా కనిపించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ద్రవ్య విధాన కమిటీ 'విత్‌డ్రావల్ ఆఫ్ అకామోడేషన్' వద్ద పాలసీ వైఖరిని మార్చకుండా ఉంచాలని నిర్ణయించిందని.. ఈ వైఖరికి 6 ఎంపీసీ సభ్యులలో ఐదుగురు మద్దతు తెలిపారని చెప్పారు.


ఆర్‌బీఐ 2024 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ రేటు అంచనాను పెంచినట్లు శక్తికాంత దాస్ తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం రేటు 5.4 శాతంగా అంచనా వేస్తున్నామని అన్నారు. ఇది గతసారి 5.1 శాతం వద్ద ఉందన్నారు. ద్రవ్యోల్బణం రేటుపై ద్రవ్య విధాన కమిటీ ఓ కన్నేసి ఉంచుతుందన్నారు. ఆహార ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తున్నా.. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో భారత ఆర్థిక వ్యవస్థ గణనీయమైన పురోగతిని సాధించిందని పేర్కొన్నారు.


2024 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిని 6.5 శాతంగా ఆర్‌బీఐ అంచనా వేసింది. ఇది చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ కంటే మెరుగ్గా ఉంటుందని ఆర్‌బీఐ చెబుతోంది. ప్రస్తుతం ప్రపంచస్థాయిలో అనిశ్చిత పరిస్థితులు ఉన్నా.. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు బలంగానే ఉందని అంటోంది. దేశ స్థూల ఆర్థిక పరిస్థితి బలంగా ఉండడంతో ప్రపంచ ఆర్థిక వృద్ధికి మన దేశం ఇంజిన్‌గా మారిందని పేర్కొంది. ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రస్తుతం భారత్ ఇతర దేశాల కంటే మెరుగైన స్థానంలో ఉంది.


ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుందని అంచనా వేస్తోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్‌బీఐ రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకోపోవడంతో 6.50 శాతంగా వద్దే కొనసాగనుంది. రివర్స్ రెపో రేటు 3.35 శాతంలో ఎలాంటి మార్పు ఉండదు. అదేవిధంగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్‌) బ్యాంక్ రేటు 6.75 శాతంలో కూడా ఆర్‌బీఐ మార్పులు చేయలేదు.


Also Read: Asian Champions Trophy 2023: పాకిస్థాన్ పై గెలిచి.. సెమీస్ కు దూసుకెళ్లిన భారత్..


Also Read: Peon To Richest Man Success Story: ఒకప్పుడు ప్యూన్.. ఇప్పుడు 88 వేల కోట్లకు అధిపతి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి