RBI On Repo Rate: రెపో రేటు విషయంలో ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అందరూ ఊహించినట్లే వడ్డీ రేట్ల విషయంలో ఎలాంటి మార్పు చేయకుండా యథాతథంగా ఉంఇంది. మానిటరీ పాలసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. రెపోరేటు 6.5 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఎంఎస్ఎఫ్, బ్యాంక్ రేటు కూడా 6.75 శాతం వద్ద స్థిరంగా ఉంటుందన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ఆయన ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. ఈ తరుణంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమివ్వాల్సిన అవసరం ఉంది. అందుకే కీలక రేట్లలో ఎలాంటి మార్పులు చేయకూడదని కమిటీ నిర్ణయం తీసుకుంది. స్థూల ఆర్థిక స్థిరత్వం, సమ్మిళిత వృద్ధి మన దేశ పురోగతికి అంతర్లీనంగా ఉన్న ప్రాథమిక సూత్రాలు. ఇటీవలి సంవత్సరాలలో ఊహించని విపత్తుల సమయంలో మేము అనుసరించిన పాలసీ మిశ్రమం స్థూల ఆర్థిక, ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించింది." అని ఆర్‌బీఐ గవర్నర్ వెల్లడించారు. 


బెంచ్‌మార్క్ రెపో రేటును యథాతథంగా ఉంచాలని ఎంపీసీ నిర్ణయించడం ఇది నాలుగోసారి. గత ఏడాది మే నుంచి ఏప్రిల్ 2023 వరకు రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. గత ఎంపీసీ సమావేశంతో పోలిస్తే ఈసారి ద్రవ్యోల్బణం పెరిగింది. ద్రవ్యోల్బణం అదుపులోకి తీసుకువచ్చేందుకు రెపో రేటును స్థిరంగా ఉంచుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ నెలలో ద్రవ్యోల్బణం దిగొచ్చే అవకాశం ఉందని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. పాత రెపో రేటును కొనసాగించడంతో ఈఎంఐలపై ఎటువంటి ప్రభావం ఉండదు. 


మరోవైపు రానున్న కాలంలో ఎఫ్‌డీ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలను బ్యాంకులు పరిశీలంచనున్నాయి. రెపో రేటు ప్రస్తుతం గత నాలుగేళ్ల రికార్డు స్థాయిలో నడుస్తోంది. ఆర్‌బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాల రేటును రెపో రేటు అంటారు. రెపో రేటు పెంచితే.. బ్యాంకుల నుంచి ఇచ్చే వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి.  హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ మొదలైన వాటిపై వడ్డీ రేట్లను పెరుగుతాయి. ఈఎంఐలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.


Also Read: సెంచరీల మోత మోగించిన కాన్వే, రచిన్‌.. ఇంగ్లండ్‌పై కివీస్ ఘన విజయం..


Also Read: Breaking: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారం.. లోక్ పోల్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి